Breaking News

పూంచ్‌ను సందర్శించనున్న రాహుల్‌

Published on Fri, 05/23/2025 - 12:23

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఇటీవల పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతిచెందిన, గాయపడిన బాధిత కుటుంబాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) పరామర్శించనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం(మే 24) జమ్ములోని పూంచ్‌ చేరుకోనున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మీడియాకు తెలిపారు.

పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన  ఉగ్ర దాడిలో 25 మంది పర్యాటకులతోపాటు స్థానికుడొకరు మృతిచెందిన తరువాత లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ జమ్ము కశ్మీర్‌ను సందర్శించడం ఇది రెండవసారి. రాహుల్‌ గాంధీ మే 24న పూంచ్‌ను సందర్శిస్తారని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎ‍క్స్‌లో పేర్కొన్న రమేష్.. ఏప్రిల్ 25న రాహుల్‌ గాంధీ పహల్గామ్ ఉగ్ర దాడిలో గాయపడిన వారిని శ్రీనగర్‌(Srinagar)లో పరామర్శించారని తెలిపారు. అప్పుడు ఆయన ఎల్‌జీ, సీఎంలతో కూడా సమావేశమయ్యారన్నారు.

గత నెలలో జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)లో పర్యంచిన రాహుల్‌ మాట్లాడుతూ దేశ ప్రజలను విభజించడమే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగిందని, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా ఓడించడానికి భారతదేశం ఐక్యంగా నిలబడటం తప్పనిసరని  పేర్కొన్నారు. మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్‌  దాడులు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నేపధ్యంలో పూంచ్ సెక్టార్‌లో రెండు వారాల క్రితం ఫిరంగి దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడులలో 27 మంది మృతిచెందగా, 70 మందికి పైగా జనం గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Coronavirus: ముంబైలో కేసుల పెరుగుదల.. అదే బాటలో తమిళనాడు, గుజరాత్‌

#

Tags : 1

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు