Breaking News

రాహుల్‌గాంధీ బ్యాగులు తనిఖీ చేసిన ‘ఈసీ’

Published on Sat, 11/16/2024 - 16:37

ముంబయి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్ర వచ్చిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బ్యాగులను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. శనివారం(నవంబర్‌ 16) మధ్యాహ్నం అమరావతిలో రాహుల్‌ హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వగానే అధికారులు ఆయన బ్యాగులు చెక్‌‌ చేశారు. 

బ్యాగులతో పాటు రాహుల్‌గాంధీ వచ్చిన హెలికాప్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో రాహుల్‌ తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలువురు ప్రముఖ నేతల బ్యాగుల తనిఖీలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. 

ఈ  తనిఖీలు’ తాజాగా రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం వివాదానికి దారి తీసింది. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఎన్నికల అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.

అయితే,ఎన్నికల వేళ ఇది సాధారణ ప్రక్రియే అంటూ ఈసీ క్లారిటీ ఇచ్చింది. కాగా,మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.నవంబరు 23న ఫలితాలను వెల్లడించనున్నారు.

ఇదీ చదవండి: కసబ్‌కు కాంగ్రెస్‌ బిర్యానీ పెట్టింది: జేపీ నడ్డా 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)