Breaking News

మేం అధికారంలోకి వస్తే ఈసీ పనిపడతాం

Published on Tue, 08/19/2025 - 07:34

గయాజీ: ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శల వాడిని మరింత తీవ్రతరం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్నికల కమిషన్‌(ఈసీ)లో ఇద్దరు కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)ల భరతం పడతామంటూ హెచ్చరికలు చేశారు. ఆదివారం సాసారం నుంచి రాహుల్‌ ఓటర్‌ అధికార్‌ యాత్రను ప్రారంభించడం తెల్సిందే. 

యాత్ర సోమవారం గయాజీకి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి రాహుల్‌ మాట్లాడారు. ఓట్ల చోరీ వాస్తవమని తేలిన తర్వాత కూడా తనను అఫిడవిట్‌ వేయాలని ఈసీ హెచ్చరించడాన్ని రాహుల్‌ గాంధీ పస్త్రావించారు. ‘మాకు కొంత సమయం ఇవ్వండి. ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మీరు చేసే దొంగతనాన్ని బయటపెడతాం. అప్పుడు దేశం ప్రజలే మిమ్మల్ని అఫిడవిట్‌ ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తారు’అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తరచూ చెప్పే స్పెషల్‌ ప్యాకేజీ మాదిరిగానే ఈసీ సైతం బిహార్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(SIR)’పేరుతో ఓటరు సవరణ తీసుకువచ్చింది. ఇదో కొత్త రకం ఓట్ల చోరీ’అని రాహుల్‌ ధ్వజమెత్తారు. 

‘ముగ్గురు ఎన్నికల కమిషనర్లు బీజేపీ సభ్యత్వం తీసుకుని పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి.. ఏదో ఒక రోజు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అప్పుడిక మీ ముగ్గురిపైనా చర్యలు తప్పవు’అని హెచ్చరించారు. రాహుల్‌ వెంట ఆర్‌జేడీ నేత తేజస్వీయాదవ్, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ నేత ముకేశ్‌ సహానీ, సీపీఐ ఎంఎల్‌ నేత దీపాంకర్‌ భట్టాచార్య ఉన్నారు. యాత్ర సోమవారం సాయంత్రం కుటుంబ  నుంచి గయాజీకి చేరుకుంది.  

ఓట్ల చోరీకి కొత్త ఆయుధం ఎస్‌ఐఆర్‌  
బిహార్‌లో ఓట్ల చోరీకి ఈసీ అమలు చేస్తున్న కొత్త ఆయుధం ఎస్‌ఐఆర్‌ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన వాట్సాప్‌ చానెల్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసి, తాజాగా బిహార్‌లో చేపట్టిన ఎస్‌ఐఆర్‌లో పేరులేని కొందరితో మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేశారు. వీరు ఆదివారం సాసారంలో మొదలైన ఓటర్‌ అధికార్‌ యాత్రలో పాలుపంచుకున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం వీరు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచే వీరి గుర్తింపు రద్దయిందని వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితిని తాము పునరావృతం కానివ్వబోమని స్పష్టం చేశారు. అనంతరం ఔరంగాబాద్‌లోనూ ఓటరు జాబితాలో పేర్లు గల్లంతైన వారితో మాట్లాడి, అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు.   

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)