Breaking News

‘రోహిత్ వేముల’ చట్టాన్ని తీసుకురండి

Published on Fri, 04/18/2025 - 17:10

న్యూఢిల్లీ:  కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విన్నవించారు. ఈ మేరకు సిద్ధరామయ్యకు ఒక లేఖ రాశారు రాహుల్ గాంధీ. విద్యా వ్యవస్థలో కులం పేరుతో దూషణలకు చెక్ పడాలంటే ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలని, దీనిలో భాగంగా కర్ణాటకలో రోహిత్ వేముల పేరుతో ఒక చట్టాన్ని చేసి దాన్ని అమలు చేయాలని రాహుల్ కోరారు.  

రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ సైతం కుల వివక్షను ఎదుర్కోన్నారనే విషయాన్ని రాహుల్ ఇక్కడ ప్రస్తావించారు.   ఆ సమయంలోనే కాదు.. నేటికీ ఇంకా కుల వివక్ష ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయాలని సిద్ధరామయ్యను కోరారు.    ఈ చట్టం చేయడానికి సిద్ధరామయ్య అంగీకరించి అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

ఏ స్థాయిలో విద్యార్థి అయినా కుల వివక్షకు గురైతే అది నిజంగా సిగ్గు చేటన్నారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీ కులాలు ఈ తరహా కుల వివక్షను ఎదుర్కోనే వారిలో ముందు వరసలో ఉన్నారన్నారు. ప్రధానంగా విద్యాస్థాయిలోనే ఈ కుల వివక్షకు గురి కావడం అధికంగా ఉందన్నారు. నవనాగరిక సమాజంలో ఇప్పటికే లక్షల మంది కుల వివక్ష బారిన పడుతున్నారన్నారు. ఎంతో  భవిష్యత్ ఉన్న రోహిత్ వేముల అనే విద్యార్థి ఇక్కడ కులం పేరుతో హత్య చేయబడ్డాడని రాహుల్ ఉద్ఘాటించారు. 

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రోహిత్ వేముల.. 2016లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. హెచ్‌సీయూ విద్యార్థి అయిన రోహిత్ వేముల.. వేధింపులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో ఆ సమయంలో దళిత సంఘాలు ఉద్యమించాయి. 

Videos

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు