Breaking News

బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. మహిళా ప్యాసెంజర్లతో ముచ్చట్లు..

Published on Mon, 05/08/2023 - 13:59

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల  చివరి రోజు ప్రచారంలో భాగంగా బెంగళూరు మెట్రోపాలిటన్  బస్సులో ప్రయాణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహిళలు, కళాశాల విద్యారినులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సమయంలో ఓ మహిళ రాహుల్‌కు తన సమస్యల గురించి వివరించింది. నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రభావాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. 

ఈ విషయంపై మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గృహలక్ష‍్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2000 ఇస్తామనే హామీని రాహుల్‌ గుర్తు చేశారు. అలాగే మహిళలకు బీఎంటీసీ, కేఎస్ఆర్‌టీసీలో ఉచిత ప్రయాణం కల్పించే విషయాన్ని కూడా ప్రస్తావించారు. 

రాహుల్‌ బీఎంటీసీ బస్సులో ప్రయాణించిన వీడియోను కాంగ్రెస్ యూత్ విభంగా ఎన్‌ఎస్‌యూఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. బెంగళురు విజన్ గురించి కర్ణాటక మహిళలలు ఏమనుకుంటున్నారో రాహుల్ స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు పేర్కొంది. కాగా.. ప్రచారం చివరిరోజున రాహుల్ తీరిక లేకుండా గడపనున్నారు. కాంగ్రెస్ నిర్వహించే పలు ర్యాలీలకు హాజరుకానున్నారు. 

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పలు ప్రీపోల్ సర్వేలు తెలిపాయి. బీజేపీ మాత్రం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తామని చెబుతోంది. ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది.
చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్‌దే విజయం..! పీపుల్స్ పల్స్ సర్వేలో కీలక విషయాలు

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు