Breaking News

అన్యాయాలపై పోరులో ముందుండాలి

Published on Mon, 01/29/2024 - 04:55

సిలిగురి: దేశంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి పశ్చిమబెంగాల్, బెంగాలీలు నాయకత్వం వహించాలని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా ఆదివారం సిలిగురిలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. యాత్రకు లభిస్తున్న ఆదరణకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘స్వాతంత్య్ర పోరాట సమయంలో సైద్ధాంతిక పోరాటానికి నాయకత్వం వహించిన బెంగాల్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

అన్యాయాన్ని ఎదుర్కోవడం, ఐక్యతను పెంపొందించడం, విద్వేష వ్యాప్తిని అరికట్టడం బెంగాల్, బెంగాలీల కర్తవ్యం. ‘మీరు సందర్భానికి తగినట్లుగా స్పందించకుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు, ఇది ఏ ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు. బెంగాల్‌ ఈ పోరాటానికి నాయకత్వం వహించాలి’అని రాహుల్‌ ఉద్ఘాటించారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను, హింసను పెంచుతోంది.

నిరుపేదలు, యువతకు బదులుగా కొందరు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తోంది’అని మండిపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన టీఎంసీ లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం, ఆ పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీని సముదాయించేందుకు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ప్రయత్నాలు జరుగుతున్న వేళ రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఎంసీ స్పందించింది.

నిజమే, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ముందుండి పోరాడిన చరిత్ర బెంగాలీలకు ఉంది. సీఎం మమతా బెనర్జీ సైతం ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్‌ నాయకత్వం మాత్రం రాష్ట్రంలో కాషాయదళంతో అంటకాగుతోంది’అని టీఎంసీ నేత శంతను సేన్‌ ఆరోపించారు. న్యాయ్‌ యాత్ర సోమవారం ఉత్తర్‌ దినాజ్‌పూర్‌ జిల్లా నుంచి బిహార్‌లోకి ప్రవేశించనుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)