Breaking News

‘మణిపూర్‌ రెండు ముక్కలైంది.. ఇప్పటికైనా ప్రధాని మోదీ..’

Published on Thu, 07/11/2024 - 16:29

ఢిల్లీ:  జాతుల మధ్య అల్లర్లతో హింస చెలరేగిన మణిపూర్‌ రాష్ట్రాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించాలని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు ఆయన ఇటీవల మూడోసారి మణిపూర్‌ సందర్శించిన వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. 

‘‘ మణిపూర్‌ ఇంకా  ఆందోళనలోనే ఉంది.   జాతుల మధ్య చెలరేగిన హింసలో ఇళ్లు కాలిపోయాయి. అమాయక ప్రజలు ప్రమాదంలో పడ్డారు. వేల కుటుంబాలు నిరాశ్రయులై సహాయక శిబిరాల్లో ఉన్నారు. నేను  2023 మే నుంచి ఇప్పటివరకు మూడుసార్లు మణిపూర్‌కు వెళ్లాను. ఇప్పటికే కూడా మణిపూర్‌  రెండు ప్రాంతాలుగా విడిపోయి ఉంది. ఇప్పటికైనా ప్రధాని మోదీ మణిపూర్‌ సందర్శించాలి. అక్కడి ప్రజలు సమస్యలు విని, శాంతిని నెలకొల్పాలి’’ అని  రాహుల్ గాంధీ అన్నారు.

ఇటీవల మణిపూర్‌లో పర్యటించిన రాహుల్‌ గాంధీ చురచంద్‌పూర్‌ సహాయక శిబిరంలో బాధితులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ ప్రభుత్వం ఇక్కడ ఘర్షణలకు  ముగింపు పలకాలని భావిస్తేనే తొందరగా సమస్య పరిష్కారం అవుతుంది.  మణిపూర్‌ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తా.కానీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని అన్నారు.

గతేడాది మణిపూర్‌లోని కుకీ, మైతేయి  జాతుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కాస్త.. సింసకు దారితీసిన విషయం తెలిసింది.  ఈ హింసాత్మక ఘటనల్ల 224 మంది మృతి చెందగా.. సుమారు 60 వేల మంది ప్రజలు వలస వెళ్లారు.

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు