Breaking News

జోడో యాత్రతో కొత్త జాతీయ ఒరవడి

Published on Sat, 04/08/2023 - 05:05

న్యూఢిల్లీ: భారత్‌ జోడో యాత్ర ద్వారా రాహుల్‌ గాంధీ ఒక బలమైన నూతన జాతీయ ఒరవడిని సృష్టించారని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు, ద్రవ్యోల్బణం పెరుగుదలను యాత్ర సందర్భంగా రాహుల్‌ ప్రముఖంగా లేవనెత్తారని గుర్తుచేశారు. 2013తో పోలిస్తే 2023లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయానని వెల్లడించారు.

గత పదేళ్లలో ఇంటి బడ్జెట్‌ తీవ్రంగా ప్రభావితమైందని తెలిపారు. ఈ మేరకు పట్టికను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ పట్టికను గమనించాలని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, నిర్వాకాలను రాహుల్‌ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అధికార బీజేపీ బెంబేలెత్తిపోతోందని వెల్లడించారు. అందుకే రాహుల్‌పై బురద చల్లుతోందని జైరామ్‌ రమేశ్‌ మండిపడ్డారు. రాహుల్‌ సృష్టించిన నూతన ఒరవడి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)