Breaking News

‘పెళ్లెప్పుడు?’.. రాహుల్‌ సమాధానాల జాబితా!

Published on Tue, 05/14/2024 - 12:19

‘పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తరచూ ఎదురవుతుంటుంది. దీనికి అతని నోటి నుంచి సమాధానం తెలుసుకోవాలని చాలా మంది  ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల రాయ్‌బరేలీలో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం రాహుల్‌ గాంధీ ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయన మరోమారు ఈ ప్రశ్నను ఎదుర్కోవలసి వచ్చింది. దానికి రాహుల్ గాంధీ నవ్వుతూ బదులిచ్చారు.

రాయ్‌బరేలీ  ఎన్నికల ర్యాలీలో ఒక వ్యక్తి రాహుల్‌ను  మీ పెళ్లెప్పుడు? అని అడిగాడు. దానికి రాహుల్‌ నవ్వుతూ ‘త్వరలోనే చేసుకోవాలి’ అని సమాధానమిచ్చారు. గతంలో రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నప్పుడు ఓ ఆరేళ్ల చిన్నారి.. రాహుల్‌తో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించింది. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘ప్రస్తుతం నేను పనుల్లో బిజీగా ఉన్నాను’ అని సమాధానమిచ్చారు. వెంటనే ఆ చిన్నారి ‘ఆ పనులు ఎప్పుడు పూర్తవుతాయని’ అడిగింది.  ఈ ప్రశ్న వినగానే రాహుల్ ఆశ్చర్యపోయారు. అప్పట్లో రాహుల్‌ దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.

ఒకసారి పట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్.. రాహుల్ గాంధీతో ‘మా మాట విని పెళ్లి చేసుకోండి. సమయం ఏమీ మించిపోలేదు. మీరు పెళ్లి చేసుకుంటే మేము ఊరేగింపులో పాల్గొంటాం. పెళ్లి విషయంలో మీరు మీ అమ్మగారి మాట కూడా వినడం లేదని ఆమె మాతో చెప్ప బాధ పడ్డారు. మీరు పెళ్లి చేసుకోవాల్సిందే’ అని అన్నారు. దీనికి రాహుల్‌ సమాధానమిస్తూ ‘మీరు అన్నారంటే.. అయిపోతుంది’ అని అన్నారు.

గతంలో రాహుల్‌ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌కు వెళ్లిన సందర్భంలో ఆయన అక్కడ మోటార్ సైకిళ్లను రిపేర్ చేస్తున్న ఒక మెకానిక్‌తో మాట్లాడారు. అప్పుడు ఆ మెకానిక్‌ రాహుల్‌తో ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడిగాడు. దానికి రాహుల్‌ ‘నువ్వు ఎప్పుడు చేస్తే  అప్పుడే చేసుకుంటాను’ అని సమాధానమిచ్చారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)