Breaking News

Rahul Gandhi: వయనాడ్‌ బాధితులకు విరాళంగా నెల జీతం

Published on Wed, 09/04/2024 - 16:47

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఇటీవల ప్రకృతి విపత్తుతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వయనాడ్‌ కోసం విరాళం ప్రకటించారు. తన ఒక నెల జీతం రూ.2.3 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని వయనాడ్‌లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) అందజేశారు.

2 లక్షల తన విరాళానికి సంబంధించిన రశీదును ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘వయనాడ్‌లోని మా సోదర, సోదరీమణులు వినాశకరమైన విషాదాన్ని చవిచూశారు. వారు ఎదుర్కొన్న ఈ నష్టాల నుంచి కోలుకునేందుకు మన మద్దతు అవసరం. అందుకే బాధితుల సహాయార్థం, పునరావాస ప్రయత్నాలకు నా వంతు సాయంగా నెల మొత్తం జీతాన్ని విరాళంగా ఇచ్చాను’ అని రాహుల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని అందించాలని రాహుల్‌ పిలుపునిచ్చారు

కాగా, ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన బాధితుల కోసం ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా ‘స్టాండ్‌ విత్‌ వయనాడ్‌–ఐఎన్‌సీ’ అనే యాప్‌ను రూపొందించింది. వయనాడ్‌లో పునరావాస పనులకు సంబంధించిన పురోగతిని కాంగ్రెస్‌ ఎంపీ కే సుధాకరన్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం లిజు తెలిపారు.

ఇదిలా ఉండగా, జూలై 30న భారీ వర్షాలు, వరదలు వయనాడ్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు వయనాడ్‌లో భారీగా మట్టిపెళ్లలు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ విలయంలో సుమారు 400 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.  ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)