Breaking News

తెలంగాణలో కులగణన చరిత్రాత్మకం

Published on Wed, 11/27/2024 - 06:08

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని కాంగ్రెస్‌ అగ్ర నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ చెప్పారు. కాంగ్రెస్‌ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచి్చనా ఇదే తరహాలో కులగణన చేపడతామని ప్రకటించారు. తెలంగాణలో కులగణన ఫలితాల ఆధారంగా పాలసీలను రూపొందిస్తామని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని తోల్‌కటోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్‌ రక్షక్‌ అభియాన్‌’సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏం చేసినా, ఎంత అడ్డుకున్నా కులగణన, రిజర్వేషన్లకు అడ్డుగోడలు తొలగించి చూపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

‘‘తెలంగాణలో కులగణనను ప్రజా భాగస్వామ్య ప్రక్రియగా మార్చాం. కులగణన ఏదో మూసి ఉన్న గదిలో పది పదిహేను మంది రూపొందించినది కాదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు అంతా కలసి తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. ఇది చరిత్రాత్మకం. కర్ణాటక, తెలంగాణలాగే.. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా ఇదే తరహాలో కులగణన చేపడతాం. తెలంగాణలో కులగణన ఫలితాలు వస్తే.. దాని ఆధారంగా మేం పాలసీలు రూపొందిస్తాం. 

బీజేపీ భయపడుతోంది 
కులగణన అంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నాయి. నాలుగైదు శాతం మంది కోటీశ్వరుల కంట్రోల్‌లో ఈ దేశాన్ని పెట్టాలని బీజేపీ భావిస్తుంది. కులగణన చేయడం, రిజర్వేషన్లను 50 శాతం పెంచడం ద్వారానే దానిని ఛేదించగలుగుతాం. అదే పనిలో మేమున్నాం. దీనిని తెలంగాణ, కర్ణాటకలలో చేశాం. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచి్చనా దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, నిరుపేదల డేటా తీస్తాం. అభివృద్ధి, దేశ భవిష్యత్తులో వారి భాగస్వామ్యం ఎంత? భవిష్యత్తు ఏమిటి? అనేదే మా లక్ష్యం. ఈ వేదికపై రోహిత్‌ వేముల ఫొటో ఉంది. ఆయన ఎంతో మాట్లాడాలనుకున్నారు. కానీ వీళ్లు (కేంద్ర ప్రభుత్వం) రోహిత్‌ వేముల గొంతు నొక్కేశారు. యువత కలలకు వ్యతిరేకంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది.

అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు.. ఆదివాసీలా? దళితులా? 
దేశంలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్, నరేంద్ర మోదీ వీరి మధ్య అడ్డుగోడ కడుతున్నారు. అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు ఆదివాసీలా? దళితులా? దేశంలో 90 శాతం ప్రజలకు అన్యాయం జరుగుతోంది. దానికి కులగణన, రిజర్వేషన్ల పెంపు ఒక్కటే మార్గం. ఆ దిశగా ఉన్న అడ్డుగోడలను తొలగించి చూపిస్తాం. కులగణన విషయాన్ని ఊరూవాడాలో ప్రచారం చేయాలి..’’అని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)