Breaking News

రాహుల్ పౌర‌స‌త్వ కేసు విచార‌ణ‌: పిటిష‌న‌ర్ న్యాయ‌వాదిపై హైకోర్టు ఆగ్ర‌హం

Published on Mon, 07/01/2024 - 16:00

ల‌క్నో: కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ పౌర‌స‌త్వంపై దాఖ‌లైన పిటిష‌న్‌పై అల‌హాబాద్ హైకోర్టు సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ సంద‌ర్భంగా కోర్టులో నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.  పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది ఎంత సేప‌టికి వాద‌న‌లు ముగించ‌క‌పోవ‌డంతో ధ‌ర్మాసనం అత‌నిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

వివ‌రాలు.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌బ‌రేలీ నుంచి ఎంపీగాఎన్నికైన రాహుల్ గాంధీ భార‌తీయ పౌరుడు కాద‌ని, ఆయ‌న బ్రిటిష్ పౌరుడ‌ని పేర్కొంటూ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ మేర‌కు కర్ణాటక బీజేపీ కార్యకర్త ఎస్‌. విఘ్నేష్‌ శిశిర్ త‌న న్యాయవాది అశోక్‌ పాండే ద్వారా ఈ పిల్‌ దాఖలు చేశారు.

దీనిపై స్టిస్ రాజన్ రాయ్ మరియు జస్టిస్ ఓం ప్రకాష్ శుక్లాలతో కూడిన ధర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ సంద‌ర్భంగా  దాదాపు 90 నిమిషాల పాటుఅశోక్‌ పాండే వాద‌న‌లు వినిపించారు. అయితే ఆయ‌న వాద‌న‌లు విన్న త‌ర్వాత ఈ కేసులో ఉత్త‌ర్వుల‌ను రిజ‌ర్వ్ చేస్తున్న‌ట్లు ధ‌ర్మాస‌నం పేర్కొంది.

అయిన‌ప్ప‌టికీ న్యాయ‌వాది పాండే త‌న‌కు వాదించేందుకు మరింత స‌మ‌యం కావాల‌ని పట్టుబట్టారు. దీనిపై ధర్మాసనం స్పందింస్తూ.. త‌న‌కు, త‌న  పిటిషనర్‌కు వాదనలు వినిపించేందుకు స‌రైన‌స‌మ‌యం ఇచ్చింద‌ని,  తమ వాదనలన్నీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పడంతో న్యాయవాది పాండే అసహనానికి గురయ్యారు.

త‌నకు వాదించ‌డానికి మ‌రింత స‌మ‌యం కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. 20 రోజులపాటు వాద‌న‌లు జ‌రుగుతాయ‌ని, కానీ ధ‌ర్మాస‌నం గంట కూడా త‌న మాట‌లు విన‌డం లేద‌ని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, వాదనలు తగినంతగా ఉంటే ఆ విషయాలపై విచారణలు 20 రోజుల పాటు కొనసాగించ‌వ‌చ్చని పేర్కొంది. న్యాయవాది పాండే చేస్తున్న వాదనలను ఇప్పటికే కోర్టు విని పరిశీలించిందని ధర్మాసనం మరోసారి నొక్కి చెప్పింది.

అయిన‌ప్ప‌టికీ పాండే విన‌కుండా.. బెంచ్ వ్య‌క్తిగ‌తంగా వ్య‌వ‌హ‌రించ‌కూడాద‌ని అన్నారు. దీంతో ధ‌ర్మ‌సానం ఆగ్ర‌హంవ్య‌క్తం చేసింది. మీరు మా స‌హ‌నాన్ని ప‌రిక్షిస్తున్నారు. కోర్టు స‌మ‌యాన్ని వృథా చేస్తున్నారు. మీకు వాదించ‌డానికి త‌గినంత స‌మ‌యం ఇచ్చాము. మీ ప్ర‌వ‌ర్త‌న చూస్తుంటే ఇత‌ర కేసుల‌ను విన‌కుండా చేయాల‌ని చూస్తున్న‌ట్లు ఉంది అని పేర్కొంది.  చివ‌రికి న్యాయమూర్తులు న్యాయస్థానం నుంచి బయలుదేరుతుండగా.. హైకోర్టు తుది కోర్టు కాద‌ని వ్యాఖ్యానించారు.

త‌న వాద‌న‌లు అనంత‌రం కొత్త పిటిషన్ దాఖలు చేసేందుకు తాజా పిల్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని బెంచ్‌ను అభ్యర్థించారు పాండే. దీనిపై ధ‌ర్మాస‌నం స్పందిస్తూ.. ఒకవేళ‌ పిల్‌ను పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే, కోర్టు సమయాన్ని 90 నిమిషాల వృధా చేసినందుకు బెంచ్ అతనిపై పెనల్టీ విధిస్తుంద‌ని మంద‌లించింది.

Videos

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

Photos

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం