Breaking News

కోల్‌కతా వైద్యురాలి ఘటనపై మౌనం వీడిన రాహుల్‌.. ఏమన్నారంటే!

Published on Wed, 08/14/2024 - 17:47

న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. వైద్యురాలిపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.

ఈ ఘటన దేశ వ్యాప్తంగా వైద్యరంగంలో మహిళల్లో అభద్రతాభావం పెంచుతోందన్నారు. విద్యా, వైద్య సంస్థల్లో భద్రతా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించడంలో స్థానిక అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు.

‘భాదితులకు న్యాయం చేయడానికి బదులుగా నిందితులను రక్షించే ప్రయత్నం చూస్తుంటే.. ఆసుపత్రి, స్థానిక పరిపాలనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. మెడికల్ కాలేజీ లాంటి చోట డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువుల కోసం బయటకి ఎలా పంపుతారనే ఆలోచనను రేకెత్తిస్తోంది. నిర్భయ కేసు తర్వాత చేసిన కఠిన చట్టాలు కూడా ఇలాంటి నేరాలను అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నాయి’ అని ప్రశ్నించారు.

‘హత్రాస్ నుంచి ఉన్నావ్ వరకు.. కథువా నుంచి కోల్‌కతా వరకు మహిళలపై నిరంతరం పెరుగుతున్న అరాచకాలపై ప్రతి పార్టీ, సమాజంలోని ప్రతి వర్గం తీవ్రమైన చర్చలు జరపాలి. వీటిని నిరోధించేందుకు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.

మరోవైపు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం.. కోల్‌కతా వైద్యురాలి  ఘటన భయానకమైనదిగా పేర్కొ  న్న విషయం తెలిసిందే. దీనిని హృదయవిదారకమైన సంఘటనగా ఆమె అభివర్ణించారు. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మమతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా మృతురాలి కుటుంబానికి, వైద్య సిబ్బందికి న్యాయం జరుగుతుందని ఆమె ఆకాంక్షించారు. పని ప్రదేశంలో మహిళల భద్రత అనేది ఒక పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనికి తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉందని  స్పష్టం చేశారు.

శుక్రవారం తెల్లవారుజామున ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందేఈ కేసులో సంజయ్ రాయ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తోంది. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)