Breaking News

లోక్‌సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్‌గాంధీ

Published on Mon, 07/01/2024 - 15:30

సాక్షి,ఢిల్లీ:లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ప్రసంగం వివాదానికి దారి తీసింది.  సోమవారం(జులై1) ఆయన సభలో మాట్లాడుతూ బీజేపీపై లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. హిందుత్వ అంటే అబద్ధాలు ప్రచారం​ చేయడం, ద్వేషం పెంచడం కాదన్నారు.

బీజేపీ మాత్రం ఇవే చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. హిందువులుగా చెప్పుకునే వాళ్లు హింస, అబద్ధాలు, ద్వేషం గురించే మాట్లాడతారు. ఇలాంటి వాళ్లు హిందువులు కాదన్నారు. 

సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్‌...స్పీకర్‌ అభ్యంతరం..

అయితే రాహుల్‌ సభలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ శివుని ఫొటోనూ సభలో ప్రదర్శించారు. దీనిని స్పీకర్‌ ఓంబిర్లా తప్పుపట్టారు. సభలో ప్లకార్డులు, ఫొటోలు ప్రదర్శించడానికి రూల్స్‌ ఒప్పుకోవని చెప్పారు. 

రాహుల్‌గాంధీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • నా ఇల్లు, ప‌ద‌వి లాగేసుకున్నారు
  • విప‌క్ష నేత‌ల‌ను, ఈడీ, సీబీఐల‌తో బెదిరిస్తున్నారు
  • ఈడీ నుంచి 55 గంట‌ల విచార‌ణ ఎదుర్కొన్నా
  • ప‌ర‌మ‌తాత్మ మోదీతో నేరుగా మాట్లాడ‌తారు
  • అదికారం కంటే నిజం గొప్ప‌ది
  • ప్ర‌తిప‌క్షంలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా, గ‌ర్వ‌ప‌డుతున్నా
  • శివుడి ఎడ‌మ చేతి వెనక‌ త్రిశులం ఉంటుంది
  • త్రిశూలం హింసకు చిహ్నం కాదు
  • ఒక‌వేళ త్రిశూలం హింస‌కు చిహ్నం అయితే, శివుడి కుడి చేతిలో ఉండేది
  • కొంద‌రికి ఆ చిహ్నం అంటే భ‌యం
  • స‌భ‌లో గురునాన‌క్ ఫోటోను సైతం ప్ర‌ద‌ర్శించిన రాహుల్‌
  • హిందూ స‌మాజం అంటే ఒక్క మోదీ కాదు
  • హిందువులంటే ఆర్ఎస్ఎస్‌, బీజేపీ వారే కాదు
  • స‌భ‌లో ఉన్నావారు, బ‌య‌ట‌వారు కూడా హిందువులే

రాహుల్‌ వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం..

లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద ప్రసంగంపై  ప్రధాని మోదీ అభ్యంతరం తెలిపారు. హిందువులు హింసావాదులన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువులపై దాడి అని మోదీ అని అభివర్ణించారు.అనంతరం మాట్లాడిన కేంద్రహోం మంత్రి అమిత్‌ షా రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

నా మైక్‌ మళ్లీ కట్‌ చేశారు.. రాహుల్‌

లోక్‌సభలో తన మైక్‌ను మళ్లీ కట్‌ చేశారని రాహుల్‌గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని ప్రశ్నించారు. మైక్‌ కట్‌ చేశారని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్‌ స్పందించారు. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. 

రాహుల్‌ వర్సెస్‌ స్పీకర్‌

లోక్‌సభలో స్పీకర్‌ వ్యవహారశైలిని కూడా తప్పుబట్టారు రాహుల్‌ గాంధీ.మోదీ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినప్పుడు తలవంచారని, తాను షేక్‌ హ్యాండ్‌ ఇస్తే నిటారుగా నిలబడే ఇచ్చారని రాహుల్‌ వ్యాఖ్యానించారు.దీనిపై స్పందించిన స్పీకర్‌ ఓం బిర్లా.. ‘ తన కంటే వయసులో మోదీ పెద్దవారు కాబట్టే తలవంచానని వివరణ ఇచ్చారు.


రాజ్యాంగానికి మేము రక్షణగా నిలబడతాం: రాహుల్‌
కేంద్ర  ప్రభుత్వం ఈడీ, సీబీఐలో పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు రాహుల్‌. ‘ఈడీ విచారణను 65 గంటలు ఎదుర్కొన్నా అధికారం కంటే నిజం గొప్పది’ అని రాహుల్‌ స్పష్టం చేశారు.

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు