Breaking News

హ‌ర్యానా, పంజాబ్‌ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

Published on Wed, 10/16/2024 - 12:57

న్యూఢిల్లీ: ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో క్షీణిస్తున్న వాయు కాలుష్యం కేసులో పంజాబ్‌, హ‌ర్యానా ప్ర‌భుత్వాల‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పంట వ్య‌ర్ధాల ద‌హ‌నం  సమస్యను పరిష్కరించేందుకు ఆ రాష్ట్రాలు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ఈ మేరకు పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల చీఫ్ సెక్ర‌ట‌రీల‌కు స‌మ‌న్లు జారీ చేసింది.  అక్టోబ‌ర్ 23వ తేదీన  వ్య‌క్తిగ‌తంగా హాజ‌రై, ప‌రిస్థితిని వివ‌రించాల‌ని సర్వోన్నత న్యాయస్థానం‌ తమ ఆదేశాల్లో పేర్కొంది

ఈ మేరకు జ‌స్టిస్ అభ‌య్ ఎస్ ఓకా, అసానుద్దీన్ అమానుల్లా, ఆగ‌స్టిన్ జార్జ్ మాషిస్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం దేశాలు ఇచ్చింది.  కాలుష్య నిరోధక చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులను విచారించాలంటూ జూన్ 2021న తాము జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని రెండు రాష్ట్రాలపై మండిపింది. తమ ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హె చ్చరించింది

కాగా దేశ రాజధాని దిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది. దీనికి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, హరియాణాల్లో పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణంగా మారుతోంది. దీనిపై కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

అనేకసార్లు చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం తనను తాను ‘నిస్సహాయతగా’ ప్రకటించుకోవాలని కోర్టు చీవాట్లు పెట్టింది. ‘ఇక మేము ఏం చేయలేము... మేము నిస్సహాయులమని వారిని వారే ప్రకటించుకోనివ్వండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పంజాబ్, హర్యానా రెండూ గత మూడు సంవత్సరాలుగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, ముఖ్యంగా పంట వ్యర్థాలను కాల్చే రైతులపై చర్యలు తీసుకోలేదని, కేవలం నామమాత్రపు జరిమానాలు మాత్రమే విధించాయని కోర్టు పేర్కొంది.

ఢిల్లీ, ఎన్సీఆర్‌ పరిధిలో వాయు న్యాణ్యతను పర్యవేక్షించి, నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్‌ను కూడా తీవ్రంగా విరుచుకుపడింది. పంట వ్య‌ర్ధాల కాల్చివేత‌ను నియంత్రించేందుకు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని సీఏక్యూఎంను సుప్రీం అడిగింది. ఇదేమీ రాజ‌కీయ అంశం కాదని పేర్కొంది.  ఉల్లంఘనల కట్టడిలో విఫలమైనందుకు గానూ పంజాబ్‌, హరియాణా ప్రభుత్వ అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)