Breaking News

మళ్లీ మొదలైన పంట వ్యర్ధాల దహనం 

Published on Mon, 09/22/2025 - 06:25

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి పొరుగునున్న పంజాబ్‌లో మళ్లీ పంట వ్యర్థాల దహనాలు మొదలయ్యాయి. ఇలా పంట వ్యర్థాలకు నిప్పు పెడితే ఉపేక్షించరాదని, అవసరమైతే కొందరు రైతులను జైలుకు పంపాలని ఇటీవల సుప్రీకోర్టు సైతం కన్నెర్ర చేసింది. రైతులు మాత్రం పట్టించుకోకుండా గడ్డి దుబ్బలను దహనం చేస్తున్నారు. పంట వ్యర్థాల దహనాలపై ఆదివారం ఒక్క రోజే పంజాబ్‌లో 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. పంజాబ్‌లో ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలవుతున్నందున రానున్న రోజుల్లో వ్యర్ధాల దహనం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

వరి కోతల తర్వాత అక్టోబర్‌–నవంబర్‌ నెలల్లో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాలను కాల్చడమే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. వరి కోతకు, రబీలో గోధుమలను విత్తడానికి మధ్య సమయం తక్కువగా ఉండటంత్లో రైతులు తరచుగా వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్యం పెరిగేందుకు కారణమవుతోంది. 

ఈ దృష్ట్యా పంట దహనాలను నివారించేందుకు కేంద్రం భూ విస్తీర్ణం ఆధారంగా రూ.5వేల నుంచి రూ.30వేల వరకు జరిమానాలు విధిస్తూ కేంద్రం గత ఏడాది ఉత్తర్వులిచి్చంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 400 మార్కును దాటుతుండటం, ప్రజలకు తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర అనారోగ్యాలను ఎదుర్కొంటుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 1,500 మందికి పైగా రైతులకు జరిమానాలు సైతం విధించారు. దీంతో పాటే పంట వ్యర్థాలను కాల్చే సంఘటనలను నివారించేందుకు 8వేల మంది నోడల్‌ అధికారులతో ఓ ప్రత్యేక దళాన్ని సైతం ఏర్పాటు చేశారు. దీనికి తోడు సెక్షన్‌ 223 కింద గత ఏడాది 5,797 కేసులు సైతం నమోదయ్యాయి. ఇందులో ఒక్క సంగ్రూర్‌ జిల్లాలోనే 1,725 కేసులు నమోదయ్యాయి. 
 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)