Breaking News

చండీగఢ్‌పై సవరణ బిల్లు.. కేంద్రానికి సీఎం హెచ్చరిక

Published on Sun, 11/23/2025 - 12:41

చండీగఢ్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్‌ రాజధాని చండీగఢ్‌ను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్‌, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌ (Chandigarh)లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చేలా రాజ్యాంగ అధికరణం 131 సవరణ బిల్లును కేంద్రం తేవడం చర్చకు దారి తీసింది. ఇక, ఈ బిల్లును పంజాబ్‌లోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఆప్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్‌, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు గానూ రాజ్యాంగంలోని అధికరణం 131ను సవరిస్తూ బిల్లు తీసుకురానుంది. త్వరలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్‌ ఆర్టికల్‌ 240 పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై పంజాబ్‌లోని పార్టీలు మండిపడుతున్నాయి. ఈ బిల్లును ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్‌ (Congress), అకాలీదళ్‌ (Akali Dal)  తీవ్రంగా వ్యతిరేకించాయి.

భగవంత్‌ మాన్‌ ఆగ్రహం.. 
ఈ బిల్లుపై తాజాగా పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..‘చండీగఢ్‌తో పంజాబ్‌కు విడదీయరాని బంధం ఉంది. పంజాబ్‌కు దానిపై హక్కు కూడా ఉంది. చండీగఢ్‌ నగరాన్ని నిర్మించేందుకు పంజాబ్‌లోని పలు గ్రామాలను నాశనం చేశారు. అభివృద్ధి కోసం ఎంతో చేశారు. చండీగఢ్‌ నగరాన్ని ఏ మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్‌ రాజధానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకొంటాం’ అని హెచ్చరించారు.

240 పరిధిలోనే మిగతా ప్రాంతాలు.. 
మరోవైపు.. ఆప్‌ అగ్రనేత అరవింద్‌  కేజ్రీవాల్‌ కూడా పంజాబ్‌ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తోందని అభివర్ణించారు. నియంతృత్వం ఎదుట పంజాబ్‌ ఏనాడు తలవంచలేదని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమరీందర్‌ సింగ్‌ రాజా స్పందిస్తూ.. చండీగఢ్‌ పంజాబ్‌కు చెందినదేనని.. దానిని లాక్కోవడానికి చేసే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక, చట్టసభల్లేని కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్‌-నికోబార్‌ దీవులు, దాద్రా-నగర్‌ హవేలీ, లక్షద్వీప్‌, డామున్‌-డయ్యూ ప్రస్తుతం అధికరణం 240 పరిధిలోనే ఉన్నాయి.

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)