Breaking News

అందుకే శంభు సరిహద్దు తెరిచాం: పంజాబ్‌ సర్కారు

Published on Sat, 03/22/2025 - 06:56

న్యూఢిల్లీ: పంజాబ్-హర్యానా సరిహద్దులో గత 13 నెలలుగా మూసివేసిన శంభు సరిహద్దు ఇప్పుడు తెరుచుకుంది (Shambu Border Reopen). ఇక్కడ నిరసన చేస్తున్న రైతులను పోలీసులు తరలించారు. ఈ నేపధ్యంలో రైతు నేతలు జగ్జీత్ సింగ్ దల్లెవాల్, సర్వాన్ సింగ్ పంధేర్ సహా దాదాపు 400 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

పంజాబ్ పోలీసులు శంభు సరిహద్దును తెరవడంతో  ఈ దారిలో రాకపోకలు సాగించేవారు.. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు(Entrepreneurs) ఊపిరిపీల్చుకున్నారు. కాగా రైతు నేత రాకేష్ టికైత్ మాట్లాడుతూ  పోలీసుల చర్య సరైనది కాదని, దీనిపై రైతు సంఘాలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరోవైపు యునైటెడ్ కిసాన్ మోర్చా మార్చి 26న పంజాబ్ అసెంబ్లీకి మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది. శంభు సరిహద్దు మూసివేయడం వల్ల పంజాబ్‌లోని పలు పరిశ్రమ భారీ నష్టాలను చవిచూశాయని ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా ఉపాధి సంక్షోభం ఏర్పడుతున్నదని, అందుకే శంభు సరిహద్దును ఖాళీ చేయించామని పేర్కొంది.

శంభు సరిహద్దును మూసివేయడం వలన ఇక్కడి పరిశ్రమలు ఎగుమతులు, దిగుమతులను చేయలేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. కాగా పంజాబ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా ఉండాలని భగవంత్ మాన్ ప్రభుత్వం కోరుకుంటోంది. తద్వారా పంజాబ్ యువతకు ఉపాధి లభిస్తుందని, దీంతో వారు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉంటారని ‍ప్రభుత్వం భావిస్తోంది. రైతులను ఆదుకుంటామని కూడా చెబుతోంది. 

ఇది కూడా చదవండి: గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడి.. 70 మంది మృతి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)