Breaking News

‘పంజాబ్‌ సర్వ నాశనం’: సీఎం సంచలన వ్యాఖలు

Published on Sun, 11/09/2025 - 08:22

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని తర్న్ తరన్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్జిత్ సింగ్ సంధు తరపున ప్రచారం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని, పలు విమర్శలు గుప్పించారు. ‘ఆప్‌’ తమ  పాలనలో ఢిల్లీని నాశనం చేసినట్లే, ఇప్పుడు పంజాబ్‌ను  కూడా సర్వ నాశనం చేస్తోందని ఆరోపించారు.

ప్రచార సభలో రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నిక కేవలం ఒక సీటు గురించి కాదని, రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధిపైనేనని ఆమె అన్నారు. పంజాబ్ ప్రభుత్వం మాదకద్రవ్యాల దుర్వినియోగం, శాంతిభద్రతల సమస్యలు, రుణ సమస్యల్లో మునిగిపోయిందని ఆరోపించారు. నవంబర్ 11న తర్న్ తరన్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ  అభ్యర్థి హర్జీత్ సింగ్ సంధుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిరోజూ హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.

పంజాబ్‌ రాష్ట్రమంతా మాదకద్రవ్యాల వ్యసనంలో మునిగిందని ఆరోపించారు. రాష్ట్రంపై పెరుగుతున్న అప్పు భారం ప్రజలపై పడిందని రేఖా గుప్తా అన్నారు. ఈ ప్రచారానికి ముందు ఆమె తర్న్ తరన్‌లోని దర్బార్ సాహిబ్‌లో పూజలు చేసి, రాష్ట్రంలో శాంతి, సామరస్యం శ్రేయస్సు కోసం ప్రార్థించారు.  అనంతరం ఆమె ఠాకూర్ద్వారా ఆలయాన్ని సందర్శించి, అక్కడున్న భక్తులతో సంభాషించారు. ఢిల్లీ క్యాబినెట్ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా  ఆమె వెంట పర్యటించారు.

ఇది కూడా చదవండి: ‘హెచ్చరించినా పట్టించుకోలేదు’.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)