Breaking News

ప్రమాదవశాత్తూ పేలిన తుపాకీ.. పంజాబ్‌ ఆప్‌ ఎమ్మెల్యే మృతి

Published on Sat, 01/11/2025 - 07:14

లూధియానా: పంజాబ్‌కు చెందిన ఆప్‌ నేత, లూధియానా (వెస్ట్‌) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్‌ బస్సి గోగి(58) ప్రమాదవశాత్తూ బుల్లెట్‌ గాయంతో చనిపోయారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తన లైసెన్స్‌డ్‌ పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా అనుకోకుండా పేలి కణత నుంచి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో చనిపోయారని కుటుంబసభ్యులు, ఆప్‌ నేతలు తెలిపారు. 

తీవ్రంగా గాయపడిన గుర్‌ప్రీత్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ జస్‌కరణ్‌ సింగ్‌ తేజ తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని కుటుంబసభ్యులు తెలిపారన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఎమ్మెల్యే గుర్‌ప్రీత్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

ఘటనకు కొద్ది గంటలకు ముందు గుర్‌ప్రీత్‌ బుద్ధా నల్లాలో వ్యర్థాల తొలగింపుపై స్పీకర్‌ కుల్తార్‌ సింగ్, ఎంపీ బల్బీర్‌ సింగ్‌పై చర్చలు జరిపారని ఆప్‌ నేత ఒకరు వెల్లడించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో లూధియానా(వెస్ట్‌)నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గుర్‌ప్రీత్‌ రెండు పర్యాయాలు ఆ సీటును గెలుచుకున్న భరత్‌ భూషణ్‌పై విజయం సాధించారు. అంతకుముందు, లూధియానా మున్సిపల్‌ కౌన్సిలర్‌గా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. 

గత నెలలో లూధియానా మున్సిపల్‌ ఎన్నికల్లో ఆయన భార్య సుఖ్‌చెయిన్‌ కౌర్‌ గోగి పోటీ చేసి ఓటమి చెందారు. బుద్ధా నల్లా నవీకరణ పనుల్లో జాప్యం అవుతున్నందుకు నిరసనగా గతేడాది శంకుస్థాపన ఫలకాన్ని ధ్వంసం చేసి గుర్‌ప్రీత్‌ వార్తల్లో కెక్కారు. ఎమ్మెల్యే గుర్‌ప్రీత్‌ ఆకస్మిక మృతిపై సీఎం భగవంత్‌ సింగ్‌మాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ సీఎం, బీజేపీ నేత అమరీందర్‌ సింగ్, పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమరీందర్‌ వారియర్‌ తదితరులు సంతాపం తెలిపారు.  
 

ఎమ్మెల్యే గురుప్రీత్ గోగిని కాల్చి చంపిన దుండగులు

 

 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)