Breaking News

ఇన్‌స్టాల్‌మెంట్‌లో మామిడి పండ్లు కొనుక్కోవచ్చని మీకు తెలుసా!

Published on Sat, 04/08/2023 - 15:03

ఇంతవరకు ఈఎంఐలో కేవలం ప్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను కొనుక్కోవడమే తెలుసు. కానీ ఇక నుంచి పండ్లు కూడా ఈఎంఐలో కొనుక్కునే వెసులు బాటు వచ్చేస్తోంది. దీంతో ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్ధతిలో కావాల్సిన పండ్లు కొనేయొచ్చు, తినేయొచ్చు. వివరాల్లోకెళ్తే.. మామిడి పళ్లలో రారాజుగా అల్ఫోన్సో మామిడి పళ్లను పిలుస్తారు. వీటి ధర కూడా చాలా ఎక్కువ.

రిటైల్‌ మార్కెట్‌లోనే వీటి ధర డజను రూ. 800 నుంచి రూ. 1300 వరకు పలుకుతుంది. దీంతో బాగా ధనవంతులు తప్ప కామన్‌మెన్‌ దీని జోలికే పోనేపోడు. అందుకని అందరు కొనేలా సులభమైన రీతిలో వెసులుబాటు కల్పించాలని ఈ సరికొత్త ఆలోచనకు నాంది పలికాడు పూణెకి చెందిన గౌరవ్‌సనస్‌. తన పళ్ల ఉత్పత్తులకు సంబంధించిన గురుకృపా ట్రేడర్స్‌తో ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చాడు.

దీంతో ఎలక్ట్రానిక్‌ వస్తువుల మాదిరిగానే ఈఎంఐలో కొనేయొచ్చు అని చెబుతున్నాడు గౌరవ్‌. అందుకోసం కస్టమర్‌ క్రెడిట్‌ కార్డు ఉపయోగించాలి. ఈ ఈఎంఐని మూడు, ఆరు లేదా 12 నెలల్లో కట్టేయాలి. ఇప్పటి వరకు ఈ విధానంలో నలుగురు వినయోగదారులు ఆ మామిడిపళ్లను కొనుగోలు చేసినట్లు గౌరవ్‌ తెలిపారు. 

(చదవండి: సుఖోయ్‌ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)