Breaking News

బర్గర్‌ కింగ్‌ వర్సెస్‌ బర్గర్‌ కింగ్‌..!

Published on Tue, 08/20/2024 - 10:37

పుణె: అంతర్జాతీయ ఫాస్ట్‌–ఫుడ్‌ చెయిన్‌ బర్గర్‌ కింగ్‌ కార్పొరేషన్‌పై పుణెలో బర్గర్‌ కింగ్‌ పేరుతో ఉన్న రెస్టారెంట్‌ 13 ఏళ్లపాటు సాగిన న్యాయ పోరాటంలో విజయం సాధించింది. ‘బర్గర్‌ కింగ్‌’పేరును వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 13 వేలకుపైగా ఔట్‌లెట్లు కలిగిన తమ పేరును దెబ్బతీస్తున్నారని అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ బర్గర్‌ కింగ్‌ కార్పొరేషన్‌ 2011లో పుణె కోర్టులో కేసు వేసింది. ఆ పేరును వాడకుండా సంబంధిత రెస్టారెంట్‌ను ఆదేశించాలని, తమ బ్రాండ్‌కు పూడ్చలేని నష్టాన్ని కలుగజేసినందుకు రూ.20 లక్షలు చెల్లించాలని కూడా అందులో కోరింది. 

దీనిపై పుణె బర్గర్‌ కింగ్‌ యజమానులైన అనహిత, షాపూర్‌ ఇరానీలు న్యాయపోరాటం జరిపారు. ఒక్క పేరు తప్ప, బర్గర్‌ కింగ్‌ కార్పొరేషన్‌తో ఎలాంటి సారూప్యతలు తమ రెస్టారెంట్‌కు లేవన్నారు. తమ వంటి చిన్న వ్యాపారాలను దెబ్బకొట్టే దురుద్దేశంతోనే ఆ సంస్థ ఈ కేసు ఏళ్లపాటు కొనసాగించిందని ఇరానీ ఆరోపించారు. దీని కారణంగా తాము తీవ్ర వేదనకు, మానసిక ఒత్తిడికి గురయ్యామని చెప్పారు. 

విచారించిన జడ్జి సునీల్‌ వేద్‌ పాఠక్‌..‘ఇరానీ 1992లోనే బర్గర్‌ కింగ్‌ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కానీ, అమెరికా కంపెనీ 2014 తర్వాతే దేశంలోకి అడుగుపెట్టింది. ఆ కంపెనీ వాదన చాలా బలహీనంగా ఉంది. పుణెలోని రెస్టారెంట్‌ బర్గర్‌ కింగ్‌ పేరుతో వినియోగదారులను తికమకపెట్టినట్లు గానీ, తప్పుదోవ పట్టించినట్లు గానీ నిరూపించలేకపోయింది’అని స్పష్టం చేశారు. అంతేకాదు, పుణె బర్గర్‌ కింగ్‌ రెస్టారెంట్‌తో తమ బ్రాండ్‌కు వాటిల్లిన నష్టంపై సరైన ఆధారాలను సైతం అమెరికా కంపెనీ చూపలేదన్నారు. అందుకే పరిహారం పొందే అర్హత కూడా ఆ సంస్థకు లేదన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎవరికీ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుణె రెస్టారెంట్‌ అదే పేరుతో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)