Breaking News

ఆపరేషన్‌ సిందూర్‌పై వ్యాఖ్యలు.. విద్యార్థిని అరెస్ట్‌

Published on Sat, 05/31/2025 - 13:58

ముంబై: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా పూణేకు చెందిన యువతినిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులు డిలీట్‌ చేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. పుణెకు చెందిన లా స్టూడెంట్‌ షర్మిస్తా పనోలి గురుగ్రాంలో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె.. ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించింది. ఒక వీడియోను మే 14, 2025న తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేస్తూ అభ్యంకర వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ.. పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. ఆమె ఒక మతంపై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

అనంతరం.. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. రాడికల్ పాకిస్తానీ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై, పెట్టిన పోస్టులపై అదే సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు కోరింది. అప్పటికే ఈ క్లిప్ వైరల్ కావడంతో కోల్కత్తా పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా కోల్కత్తా పోలీసులు షర్మిస్తాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆమెకు లీగల్ నోటీసులను పలుమార్లు పంపినప్పటికీ ఆమె, ఆమె కుటుంబం అదృశ్యమై ఆ నోటీసులపై స్పందించలేదు. దీంతో.. ఇక లాభం లేదని భావించిన పోలీసులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆమెను గురుగ్రాంలో అరెస్ట్ చేశారు. ఇక, ఈరోజు పనోలిని కోల్కత్తా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆమె అరెస్ట్ అన్యాయంగా జరిగిందని, అనైతికమని, ఆమెను తక్షణమే విడుదల చేయాలని కూడా సోషల్ మీడియలో #ReleaseSharmistha హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడం గమనార్హం. ఆమె ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. అయితే, పోలీసులు 19ఏళ్ల యువతిని అరెస్ట్ చేయడానికి 1500 కిలోమీటర్లు ప్రయాణించడంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)