Breaking News

మరో మలుపు తిరిగిన పూజా ఖేద్కర్‌ వ్యవహారం

Published on Tue, 07/16/2024 - 21:32

ముంబై:  ట్రెయినీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పుణే జిల్లా కలెక్టర్‌ సుహార్‌ దివాసే తనను వేధించారంటూ వాశిం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఓ అధికారి ధృవీకరించారు. 

మహిళా పోలీసులు సోమవారం వాశింలోని ఖేద్కర్‌ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమె పుణే కలెక్టర్‌ సుహాస్‌ దివాసేపై ఫిర్యాదు చేశారు అని ఆ అధికారి తెలిపారు. అయితే..  

గత రాత్రి 11 గం. సమయంలో ముగ్గురు మహిళా పోలీస్‌ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి 1గం. టైంలో వెళ్లిపోయారు.  పోలీసులు ఎందుకు వచ్చారనే దానిపై నిన్న మీడియా ముందు పూజా ఖేద్కర్‌ మరోలా స్పందించారు. తనకు పని ఉండి మహిళా పోలీసులను తానే పిలిచానని ఆమె చెప్పారు. అయితే ఆ పని ఏంటన్నది మాత్రం  ఆమె చెప్పలేదు. ట్రెయినింగ్‌లో ఉంటూనే పూజా ఖేద్కర్‌ గొంతెమ్మ కోర్కెలు కోరడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలపై ఆమెను వాశింకు బదిలీ చేసింది కలెక్టర్‌ సుహార్‌ దివాసే.  

మరోవైపు ఆమె శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ.. రీకాల్‌ ఆదేశాలు జారీ చేసింది ముస్సోరీ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌. తక్షణమే ఆమెను వెనక్కి రావాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆమెపై చర్యల కోసమే ఆ ఉత్తర్వులు వెలువడి ఉంటాయనే చర్చ నడుస్తోంది. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)