Breaking News

టీవీకే విజయ్‌కు బిగ్‌ షాక్‌

Published on Wed, 12/03/2025 - 08:14

సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అడుగు పెట్టనున్నారు. అయితే ఆయనకు అక్కడి ఎన్‌ఆర్‌ కాంగ్రెస్, బీజేపీ పాలకులు అనేక ఆంక్షలు విధించారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన విజయ్‌కు రోడ్‌ షో నిర్వహించేందుకు అనుమతిని నిరాకరించారు. కావాలంటే బహిరంగ సభ నిర్వహించుకోవచ్చు అని ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మంగళవారం ప్రకటించింది. దీంతో, విజయ్‌కు బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది.

వివరాల ప్రకారం.. రాజకీయ పార్టీ ఆవిర్భావంతో పూర్తిగా తన దృష్టిని తమిళనాడుపైన విజయ్‌ పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి ఓటర్లకు దగ్గరయ్యే విధంగా చేపట్టిన  మీట్‌ ది పీపుల్‌ ప్రయాణానికి కరూర్‌ విషాద ఘటన రూపంలో బ్రేక్‌ పడింది. డిసెంబర్‌ 4 నుంచి సేలం వేదికగా మళ్లీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైనా, కార్తీక దీపోత్సవాన్ని అడ్డం పెట్టుకుని  పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తనను కలిసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజల వద్దకే వెళ్లే విధంగా విజయ్‌ ముందుకు సాగుతున్నారు. గత వారం కాంచీపురం ప్రజల్ని కలిశారు. ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తన దృష్టిని తాజాగా పుదుచ్చేరిపై కూడాపెట్టే పనిలో పడ్డారు.

కాగా, డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్‌ షో, ర్యాలీ, బహిరంగ సభకు సన్నద్దమయ్యారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుదుచ్చేరి టీవీకే వర్గాలు వారం రోజుల క్రితం ఆ రాష్ట్ర డీజీపీ షాలిని సింగ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమగ్ర వివరాలను అందులో తెలియజేశారు. పుదుచ్చేరి పర్యటన ముగించుకుని మరుసటి రోజన కడలూరు వెళ్లేందుకు విజయ్‌ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పుదుచ్చేరి పాలకులు విజయ్‌కు అనేక ఆంక్షలతో అనుమతి ఇవ్వక తప్పలేదు.

కరూర్‌ ఘటన దృష్టా ముందు జాగ్రత్తగా రోడ్‌ షోకు అనుమతి ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. మంగళవారం టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్‌ అర్జున తదితరులు అనుమతి కోసం ఓ వైపు డీజీపీ కార్యాలయం, మరోవైపు సీఎం రంగస్వామిని కలిసే ప్రయత్నం చేసి విఫలమయ్యాయి. చివరకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. రోడ్‌ షో, ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అనేక ఆంక్షలతో బహిరంగ సభను నిర్వహించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)