Breaking News

పీటీ ఉష భర్త హఠాన్మరణం

Published on Fri, 01/30/2026 - 09:44

రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉషా ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త వెంగలిల్ శ్రీనివాసన్(63) గుండెపోటుతో కన్నుమూశారు.

గురువారం అర్ధరాత్రి దాటాక.. 12.30 గంటల ప్రాంతంలో తిక్కోడి పెరుమాళ్‌పురంలోని నివాసంలో శ్రీనివాసన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను పెరుమాళ్‌పురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు  ప్రకటించారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఉష ఢిల్లీలో ఉన్నారు. భర్త మరణంతో ఆమె హుటాహుటిన కేరళ బయల్దేరారు. 

శ్రీనివాసన్‌ సీఐఎస్‌ఎఫ్‌ (Central Industrial Security Force)లో ఇన్స్పెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. పరుగుల రాణి, పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌గా పేర్లున్న పీటీ ఉష.. 1991లో దగ్గరి బంధువైన శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఉజ్జ్వల్ విఘ్నేష్ అనే కుమారుడు ఉన్నాడు. 

శ్రీనివాసన్‌ మృతి గురించి సమాచారం అందిన ప్రధాని నరేంద్ర మోదీ పీటీ ఉషతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. శ్రీనివాసన్‌ మృతికి సంతాపం తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సైతం ఉష కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)