Breaking News

Video: కర్ణాటక ఎన్నికలు.. హోటల్‌లో దోసెలు వేసిన ప్రియాంక

Published on Wed, 04/26/2023 - 15:01

బెంగళూరు: కర్ణాటకలో మే 10 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ మైసూర్‌లోని ఓ హోటల్‌లో దోసెలు వేస్తూ  వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ మేరకు మైసూర్‌ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్‌ నేతలు డీకే శివ కుమార్‌, రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలలతో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మైసూర్‌లోని ప్రముఖమై పురాతన రెస్టారెంట్‌ అయిన హైలారీ హోటల్‌ని సందర్శించారు ఆమె.

అనంతరం అక్కడ హోటల్‌ యజమానులతో కలసి ఉత్సాహంగా దోసెలు వేశారు. అంతేగాక వారితో కాసేపు ముచ్చటిస్తూ మీ వ్యాపారం నిజాయితీకి, కృషికి, మంచి ఆతిథ్యానికి మారు పేరు అంటూ ప్రశంసించారు. హోటల్ సిబ్బందితో సెల్ఫీ కూడా దిగారు. ఇక్కడ దోసెలు రుచిగా ఉన్నాయని, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కూతురిని తీసుకుని అక్కడకు తీసుకువెళ్తానంటూ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉండగా, మైసూరులో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. బీజేపీ కర్ణాటకలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. రాష్ట్రంలో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో ప్రతిపక్ష నేతల సమాధులు తవ్వాలనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఏ నాయకుడి మాటలు విని ఓటు వేయకూడదని, మనస్సాక్షిని అనుసరించి ఓటు వేయాలని సూచించారు. కాగా, 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న సింగిల్‌ ఫేజ్‌లో ఎన్నికలు జరుగుతుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

(చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్‌ కలకలం.. ఆడియో క్లిప్‌ రిలీజ్‌ చేసిన అన్నామలై)

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)