Breaking News

ద్వారకలో స్కూబా డైవింగ్‌

Published on Mon, 02/26/2024 - 05:26

ద్వారక:  ఆరేబియా సముద్ర గర్భంలోని ద్వారకా నగరాన్ని మోదీ ఆదివారం దర్శించుకున్నారు. గుజరాత్‌లోని ద్వారక పట్టణ తీరంలో పాంచ్‌కుయి బీచ్‌ నుంచి స్కూబా డైవింగ్‌ ద్వారా సముద్ర అడుగు భాగానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి కాసేపు గడిపారు. ‘‘సముద్ర గర్భంలో భగవంతుడికి పూజలు చేయడం అద్భుతమైన అనుభూతి! సాక్షాత్తూ దేవుడి సన్నిధిలో గడిపినట్లుగా ఉంది’’ అన్నారు. తెల్లని డైవింగ్‌ హెల్మెట్‌ ధరించి నేవీ సిబ్బంది సాయంతో స్కూబా డైవింగ్‌ చేస్తూ సముద్రంలోకి చేరుకున్నారు.

కృష్ణుడికి పూజలు చేసి నెమలి పింఛాన్ని సమర్పించుకున్నారు. అనంతరం తన అనుభవాన్ని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఫొటోలను సైతం పంచుకున్నారు. ఇది సాహసం కంటే ఎక్కువని, ఇదొక విశ్వాసమని పేర్కొన్నారు. అనంతరం గుజరాత్‌లో ఒక సభలో మాట్లాడారు. సముద్రంలో ప్రాచీన ద్వారకా నగరాన్ని చేతల్లో తాకగానే, 21వ శతాబ్దపు వైభవోపేత భారతదేశ చిత్రం తన కళ్ల ముందు మెదిలిందని తెలిపారు.

సముద్ర గర్భంలో కనిపించిన ద్వారక దృశ్యం దేశ అభివృద్ధి పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. ఆధ్యాతి్మక వైభవంతో కూడిన ప్రాచీన కాలంలో అనుసంధానమైనట్లు భావించానని చెప్పారు. శ్రీకృష్ణుడు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రాచీన ద్వారకా నగరాన్ని సందర్శించాలన్న తన దశాబ్దాల కల నెరవేరిందని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. గుజరాత్‌ సముద్ర తీరంలో ద్వారక పట్టణంలోని శ్రీకృష్ణుడి ఆలయంలోనూ మోదీ పూజలు చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)