Breaking News

నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ చైత్ర నవరాత్రి పూజలు

Published on Sat, 03/29/2025 - 08:20

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదివారం(మార్చి 30) నుంచి చైత్ర నవరాత్రి ఉత్సవాలు(Chaitra Navratri celebrations) ప్రారంభంకానున్నాయి. మొదటి రోజున  ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్మృతి మందిరంలో జరిగే  చైత్ర నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ(Prime Minister Modi) డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించనున్నారు. 1956లో అంబేద్కర్‌ వేలాది మంది తన అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. ప్రధాని మోదీ ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోనూ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.33 వేల కోట్ల విలువైన పథకాలను ప్రకటించనున్నారు. ప్రధానమంత్రి ఆదివారం ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్‌లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.

ప్రధానమంత్రి ఆదివారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ చేరుకుంటారు. అక్కడ ఎన్‌టీపీసీ సిపత్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-3కి శంకుస్థాపన చేయనున్నారు. ఎనిమిది కిలోమీటర్ల పొడవు గల ఏడు రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 111 కిలోమీటర్ల పొడవు గల మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లను అందించనున్నారు. ఈ పథకంలోని లబ్ధిదారులకు ప్రధానమంత్రి వారి ఇంటి తాళాలను అందజేయనున్నారు.

ఇది కూడా చదవండి: Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో స్వల్ప ‍వ్యవధిలో రెండు భూకంపాలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)