Breaking News

నేడు కశ్మీర్‌కు ప్రధాని మోదీ.. భారీగా బలగాల మోహరింపు

Published on Thu, 06/20/2024 - 10:30

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు జమ్ము కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రేపు(జూన్‌ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

కాగా, ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ‘ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్‌ఫార్మింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే, జమ్ము, కశ్మీర్‌లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. ఇక, వ్యవసాయరంగానికి పెద్దపీట వేసే క్రమంలో వాటికి సంబంధించిన అనుబంధ రంగాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు పీఎంలో ఓ ప్రకటనలో తెలిపింది.

 

 

ఇక, రేపు (జూన్ 21న) అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఉదయం 6.30 గంటలకు శ్రీనగర్‌లోని ఎస్‌కేఐసీసీలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. అనంతరం, జమ్ము, కశ్మీర్ అభివృద్దితో పాటు తన పర్యటనకు సంబంధించిన అంశాలపై ప్రసంగించే అవకాశం ఉంది. కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2015 నుంచి ఢిల్లీలోని కర్తవ్యపథ్, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూరు లాంటి మహానగరాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. మరోవైపు.. మోదీ కశ్మీర్‌ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతాను ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో పోలీసులు, భద్రతా బలగాలు మోహరించాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)