Breaking News

ఇరుముడి కట్టిన రాష్ట్రపతి!

Published on Wed, 10/22/2025 - 08:50

President Droupudi Murmu Sabarimala Visit Updates..

శబరిమలకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము..

  • శబరిమల సన్నిధానానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
  • ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.
  • అనంతరం ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొన్నారు..

 

  • ఇరుముడితో శబరిమలకు రాష్ట్రపతి 
  • అయ్యప్ప ఇరుముడి ముడుపుతో రాష్ట్రపతి ముర్ము శబరిమలకు బయలుదేరారు. 

 కాసేపట్లో శబరిమలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం
  • శబరిమల దర్శనానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం గ్రౌండ్‌లో ఘన స్వాగతం
  • ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన రాష్ట్రపతికి దేవస్వం మంత్రి వీఎన్ వాసవన్ స్వాగతం పలికారు.
  • కాసేపట్లో రాష్ట్రపతి ముర్ము శబరిమలకు వెళ్లనున్నారు.
  • రాష్ట్రపతి ఉదయం 11.55 నుండి మధ్యాహ్నం 12.25 వరకు శబరిమలలో ఉండనున్నారు.  

 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్‌కు సమస్య

  • కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు సమస్య తలెత్తింది. 
  • ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్‌ తర్వాత ఓ వైపు కూరుకుపోయిన హెలికాప్టర్‌
  • గుంతలో ఇరుక్కుపోవడంతో అక్కడే ఆగిపోయిన ఆర్మీ హెలికాప్టర్‌
  • దానిని నెట్టేందుకు పోలీస్‌, అగ్నిమాపకశాఖ ప్రయత్నం.
  • కొత్తగా వేసిన కాంక్రీట్‌ కావడంతో అందులో ఇరుక్కుపోయిన హెలికాప్టర్‌ చక్రం.
     

👉రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్‌భవన్‌ నుంచి శబరిమలకు బయలుదేరారు. 

👉రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేరళలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం తిరువనంతపురం చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్, సీఎం పినరయి విజయన్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో తిరువనంతపురంలో భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. రాజ్‌భవన్‌కు ఆమె వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేశారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం శబరిమల ఆలయాన్ని దర్శించుకుంటారు.

శబరిమల సన్నిధానానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

👉ఇక, ఉదయం హెలికాప్టర్‌లో నీలక్కల్ చేరుకుని, రోడ్డు మార్గంలో పంపకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గూర్ఖా వాహనంలో(ప్రత్యేక ఫోర్‌ వీలర్‌ వాహనం) సన్నిధానం చేరుకుంటారు. శబరిమల సందర్శించిన తర్వాత సాయంత్రం తిరువనంతపురం తిరిగి వస్తారు. ఈ క్రమంలో రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విందు ఏర్పాటు చేశారు.

👉రేపు ఉదయం 10.30 గంటలకు రాజ్ భవన్‌లో మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత, మధ్యాహ్నం 12.50 గంటలకు హెలికాప్టర్ ద్వారా శివగిరి చేరుకుని, శ్రీ నారాయణ గురు మహాసమాధి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు పాలలోని సెయింట్ థామస్ కళాశాలలో ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు వేడుకను ప్రారంభిస్తారు. 24న సాయంత్రం 4.15 గంటలకు కొచ్చిలోని సెయింట్ థెరిసా కళాశాలలో జరిగే శతాబ్ది ఉత్సవాల కోసం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరుతారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)