Breaking News

అభివృద్ధిలో అంతర్భాగం ఆరోగ్య రంగం

Published on Mon, 10/27/2025 - 06:01

ఘజియాబాద్‌: దేశ అభివృద్ధిలో ఆరోగ్య రంగం విడదీయరాని భాగమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. నాణ్యమైన ఆరోగ్య సేవలు ఏ ఒక్క పౌరుడి కూడా దూరం కారాదని నొక్కి చెప్పారు. ఆదివారం ఆమె ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ప్రైవేట్‌ ఆస్పత్రి యశోద మెడిసిటీని ప్రారంభించారు. ‘ప్రభుత్వ ప్రాధామ్యాల్లో ప్రజలను వ్యాధుల బారిన పడకుండా రక్షణ కల్పించడం, ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడం కూడా ఉన్నాయి. 

అందుకే, దేశవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో మౌలిక వనరుల కల్పన, వైద్య సేవల విస్తరణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి ప్రయత్నాల ఫలితంగానే ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన భారత్‌ కల సాకారమవుతుంది’అని ముర్ము తెలిపారు. అభివృద్ధి దిశగా దేశం వేగంగా ముందుకు సాగాలంటే ప్రతి పౌరుడూ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరముందన్నారు. 

నాణ్యమైన వైద్య సేవలను మారుమూల ప్రాంతాల్లోనూ అందించేందుకు ప్రైవేట్‌ రంగం కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడికీ మెరుగైన వైద్యసేవలను అందించాలన్న లక్ష్యం నెరవేరాలంటే ప్రైవేటు సంస్థలు సైతం తమ అమూల్యమైన సేవల అందుబాటులోకి తేవాల్సిన అవసరముందని రాష్ట్రపతి తెలిపారు. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వైద్య నిపుణులంతా దేశానికీ కూడా సేవలందిస్తున్నట్లేనన్నారు. 

కేన్సర్‌ చికిత్సకు వాడే జీన్‌ థెరపీ వంటి దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐటీ–బాంబే వంటి సంస్థలతో సంబంధాలను కలిగి ఉండాలని సూచించారు. ‘ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేశ ప్రయోజనాలే ప్రాతిపదికగా ఎంతో సేవాభావంతో నిజాయతీగా పనిచేస్తున్న యశోద ఆస్పత్రి యాజమాన్యానికి ప్రశంసలు’అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. తల్లి పేరుతో యశోద మెడిసిటీ ఆస్పత్రిని నెలకొల్పిన చైర్మన్‌ డాక్టర్‌ అరోరాను రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రశంసించారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)