Breaking News

స్మార్ట్‌ టీచర్ల అవసరమే ఎక్కువ

Published on Sat, 09/06/2025 - 05:21

న్యూఢిల్లీ: విద్యార్థుల పురోభివృద్ధిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ వారికి చదువుపై ఆసక్తిని పెంపొందించే స్మార్ట్‌ టీచర్ల అవసరం ఎంతో ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. ఇటువంటి ఉపాధ్యాయులే దేశం, సమాజం అవసరాలకు అనుగుణంగా వ్యవహరించే సమర్థులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతారన్నారు. వివేకవంతులైన ఉపాధ్యాయులు పిల్లల్లో ఆత్మగౌరవం, భద్రతా భావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తారన్నారు.

 శుక్రవారం రాష్ట్రపతి ముర్ము విజ్ఞానభవన్‌లో జరిగిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విశేష సేవలందించిన 60 మందికి పైగా ఉపాధ్యాయులను సన్మానించారు. స్మార్ట్‌ బ్లాక్‌ బోర్డులు, స్మార్ట్‌ క్లాస్‌రూంలు, ఇతర అత్యంత ఆధునాతన స్కూళ్లు, ఉన్నత విద్యా సంస్థల కంటే ఎక్కువగా స్మార్టు టీచర్లే ముఖ్యమని అనంతరం ఆమె తెలిపారు. 

ఉపాధ్యాయినిగా గడిపిన సమయమే తన జీవితంలో అత్యంత అర్థవంతమైందిగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. విద్యార్థి నడవడికను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుని ప్రాథమిక కర్తవ్యమని చెప్పారు. విద్యాబుద్ధులు నేరి్పంచిన ఉపాధ్యాయులను జీవితాంతం గుర్తుంచుకోవడం, కుటుంబం, సమాజం, దేశానికి ప్రశంసనీయమైన సేవలందించడమే విద్యార్థులిచ్చే అతిపెద్ద కానుక అని రాష్ట్రపతి ముర్ము అన్నారు.

 అవార్డుల ప్రదానోత్సవానికి ముందుగా ప్రధాని మోదీ ఉత్తమ అధ్యాపకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా వారితో..‘విద్యార్థులకు ఉపాధ్యాయులు హోం వర్క్‌ ఇవ్వడం సహజం. నేను కూడా మీ అందరికీ ఒక హోం వర్క్‌ ఇవ్వాలనుకుంటున్నా. అదేమంటే.. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం. మేక్‌ ఇన్‌ ఇండియా, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ ఉద్యమానికి సారథులుగా ఉండటం..’అని పేర్కొన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)