Breaking News

వీరు దేశానికి  గర్వకారణం

Published on Sat, 12/27/2025 - 05:26

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు స్వీకరించిన చిన్నారులు వారి కుటుంబాలకు, మొత్తం దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఈ పురస్కారాలు దేశవ్యాప్తంగా బాలబాలికలందరికీ స్ఫూర్తినిస్తాయని చెప్పారు. రాష్ట్రపతి శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ‘వీర్‌ బాల్‌ దివస్‌’కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహస బాలలతోపాటు సామాజిక, సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో అసమాన ఘనతలు సాధించిన 20 మంది చిన్నారులకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ వీర్‌ బాల్‌ దివస్‌ ప్రాముఖ్యతను వివరించారు. 320 ఏళ్ల క్రితం గురు గోవింద్‌ సింగ్‌ నలుగురు కుమారులు సత్యం, న్యాయం కోసం పోరాడుతూ ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. చిన్న కుమారులైన బాబా జోరావర్‌ సింగ్, బాబా ఫతే సింగ్‌లు ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశ విదేశాల్లో గౌరవాన్ని అందుకుంటున్నాయని తెలిపారు. చిన్నారుల్లోని దేశ భక్తి, ఉన్నత విలువలను బట్టి ఒక దేశం గొప్పతనాన్ని గుర్తించవచ్చని పేర్కొన్నారు.   

ఇద్దరు తెలుగు బాలలకు పురస్కారాలు  
ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను 18 మంది పిల్లలకు, మరణానంతరం మరో ఇద్దరి తరఫున వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి ముర్ము అందజేశారు. పురస్కారాల గ్రహీతల్లో ఇద్దరు తెలుగు బాలలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పడకంటి విశ్వనాథ్‌ కార్తికేయ క్రీడా విభాగంలో పురస్కారం అందుకున్నారు. కార్తికేయ పర్వతారోహకుడు. 

2025లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి సెవెన్‌ సమ్మిట్‌ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అతిపిన్న వయసు్కడిగా ఘనత సాధించాడు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్నమయ్య జిల్లాకు చెందిన 17 ఏళ్ల పారా అథ్లెట్‌ శివానీ హోసూరు ఉప్పర సైతం క్రీడా విభాగంలో పురస్కారం అందుకున్నారు. ఈమె షాట్‌పుట్, జావలిన్‌ థ్రోలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో అవార్డులు సాధించారు. పురస్కార గ్రహీతలకు మెడల్, సరి్టఫికెట్‌తోపాటు రూ.లక్ష నగదు ప్రోత్పాహకాన్ని రాష్ట్రపతి అందజేశారు.  

పురస్కార గ్రహీతలతో ప్రధాని మోదీ భేటీ 
బాల పురస్కారాలు అందుకున్న చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్‌ మండపంలో నిర్వహించిన వీర్‌ బాల్‌ దివస్‌ కార్యక్రమంలో భాగంగా వారితో ముచ్చటించారు. చిన్న వయసులోనే ఇతరులకు స్ఫూర్తినిచ్చే విజయాలు సాధించారని ప్రశంసించారు. ఈ విజయాలు ఆరంభం మాత్రమేనని, ఇంకా సుదూర ప్రయాణం చేయాల్సి ఉందని చెప్పారు. ఈ తరంలో జని్మంచడం ఈ చిన్నారుల అదృష్టమని, వారి ప్రతిభకు దేశమంతా మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. ప్రతిభావంతులైన బాలలను మరింత ముందుకు నడిపించేందుకు ఎన్నో వేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, తాత్కాలిక ప్రజాదరణ, గ్లామర్‌కు ఆకర్షితులు కాకుండా లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలని చిన్నారులకు ప్రధాని మోదీ సూచించారు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)