యువకుడిని చితకబాదిన మంత్రి, సిబ్బంది.. వీడియో వైరల్‌

Published on Wed, 05/03/2023 - 08:47

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత ప్రేమ్‌చంద్‌ అగర్వాల్‌ నడిరోడ్డుమీద ఓ వ్యక్తిపై దాడి చేశాడు. మంత్రి అనుచరులు కూడా అతడిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కాంగ్రెస్‌ నేతలు సీరియస్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

మంత్రి ప్రేమ్‌చంద్‌ అగర్వాల్‌ రిషికేశ్‌ పట్టణంలో తన కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలో సురేంద్రసింగ్‌ నెగీ అనే వ్యక్తి తన బైక్‌తో మంత్రి వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో, కారు నుంచి కిందకు దిగిన మంత్రి ప్రేమ్‌చంద్‌.. నేగిపై సీరియస్‌ అయ్యారు. అనంతరం, నేగిపై చంపచళ్లుమనిపించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం పెరిగింది.

ఇంతలో, మంత్రి సిబ్బంది.. నేగిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ దాడిపై మంత్రి స్పందించారు. నేగి.. నన్ను అసభ్య పదజాలంతో తిట్టడంతో నా సిబ్బంది దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ దాడి ఘటనపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి ఇలాగేనా ప్రవర్తించేది? అని కాంగ్రెస్‌ మండిపడింది. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, లేదా సీఎం ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది.

ఇది కూడా చదవండి: బీజేపీ అడ్డాపై కాంగ్రెస్‌ కన్ను

Videos

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

Magazine Story About ChandraBabu Cunning Plans

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)