Breaking News

ప్రెగ్నెంట్‌ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త

Published on Thu, 02/26/2026 - 11:53

న్యూఢిల్లీ:  దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం  చోటు చేసుకుంది.  ఒకే  కుటుంబంలోనలుగురి హత్య తీవ్ర కలకలం రేపింది. 
వీరిలో గర్భిణీ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. హత్యలు జరిగిన తీరు చేసిన పోలీసులే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బిహార్‌లోని పాట్నా జిల్లాకు చెందినఈ కుటుంబం  ఢిల్లీలోని సమయ్‌పూర్ బద్లీలో గత రెండేళ్లుగా  అద్దెకు ఉంటున్నారు.  కేవత్ ఆజాద్‌పూర్ మండిలో కూరగాయల విక్రేతగా పనిచేస్తున్నాడు. అయితే బుధవారం అద్దె ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ గదిలో అనిత (30),  మూడు, నాలుగు,  ఐదేళ్ల  వయస్సున్న ఆమె కుమార్తెలు మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. వీరిని అత్యంత పాశవికంగా గొంతు కోసి  హత్య  చేసినట్టు తెలుస్తోంది.ఉదయం 8 గంటల ప్రాంతంలో సమీప బంధువు పోలీసులుకు, ఇతరులకు సమాచారం ఇవ్వడం విషయం వెలుగులోకి వచ్చింది. భర్త కేవత్ పరారీలో ఉండటంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఈ సంఘటనతో పొరుగువారు  కూడా ఒక్కపారిగా షాక్‌కు గురయ్యారు. మొదట్లో కొంచెం గొడవపడినా, వీరంతా ఆ తరువాత సంతోషంగా ఉండేవారని పొరుగువారు చెప్పారు. అటుఅనిత వదిన, 36 ఏళ్ల సుగ్ని దేవి మాట్లాడుతూ, తన 10 ఏళ్ల కుమారుడు రక్తపు మడుగులో పడి వున్నవారిని గుర్తించి తమకు సమాచారం  ఇచ్చారని,  ఆ జంట మధ్య ఎటువంటి వైవాహిక విభేదాలు లేవని, అంతా బాగానే ఉందని  చెబుతోంది. ఇద్దరూ చాలా ప్రేమగా ఉండేవారని మరో వదిన సోని దేవి వాపోయింది. 

మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వారి మధ్య గొడవ జరిగిందని. కేవత్ తన భార్య, పిల్లలపై దాడి చేయడానికి ముందు వారిని మద్యం తాగించి ఉండవచ్చని ప్రాథమికంగా తేలిందని, నిర్దిష్ట కారణం వెలుగులోకి రాలేదని పోలీసు అధికారి తెలిపారు, వివాహేతర సంబంధం, మగపిల్లవాడి కోసం, సహా ఇతర అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. భర్తను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. హత్య వెనుక గల ఉద్దేశ్యాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . 

సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడు పారిపోయినట్టు గుర్తించారు.క్రైమ్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)