Breaking News

Mahakumbh: వెలుపల లక్ష వాహనాలు.. 60 కోట్లు దాటిన పుణ్యస్నానాలు

Published on Sun, 02/23/2025 - 08:08

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు ఆఖరి ఆదివారం. దీంతో సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లెక్కకుమించిన రీతిలో భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌ వెలుపల ఎంట్రీపాయింట్‌(Entry point)ల వద్ద లక్షకుపైగా వాహనాలు నిలిచివున్నట్లు సమాచారం.

శనివారం సాయంత్రం నుంచే కుంభమేళా ప్రాంతంలో అత్యంత రద్దీ నెలకొంది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనికితోడు రాబోయే మహాశివరాత్రికి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న దృష్ట్యా స్థానిక అధికారులు ముందస్తు ఏర్పాట్లుపై దృష్టి సారించారు. ‍ప్రయాగ్‌రాజ్‌లోని ఏడు ఎంట్రీపాయింట్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం సంగమం మెయిన్‌ ఎంట్రీ పాయింట్‌లోని డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ సేతు(Dr. Shyama Prasad Sethu) చౌరస్తా వద్ద ఐదు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో రీవా పరిధిలోని చాక్‌ఘాట్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాగ్‌రాజ్‌లోని ఏడు ఎంట్రీపాయింట్లను మూసివేయడంతో భక్తులు ఇక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరం నడిచి సంగమస్థలికి చేరుకుంటున్నారు. శనివారం నాటికి కుంభమేళాలో పవిత్రస్నానాలు చేసినవారి సంఖ్య 60 కోట్లు దాటింది. మహాకుంభమేళాకు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కుంభమేళాకు 45 కోట్లమంది వస్తారని అంచనా వేశారు. అయితే ఆ అంచనా ఇప్పటికే దాటిపోయింది. 73 దేశాల ప్రతినిధులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చి పుణ్యస్నానాలు చేయడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 

ఇది కూడా చదవండి: Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)