Breaking News

ప్రణబ్‌ చనిపోతే మీరేం చేశారు.. కాంగ్రెస్‌పై శర్మిష్ఠా ముఖర్జీ సీరియస్‌

Published on Sat, 12/28/2024 - 07:35

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ పెద్దలపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రణబ్‌ ముఖర్జీ చనిపోయినప్పుడు మీరేం చేశారని కాంగ్రెస్‌ హైకమాండ్‌ను ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రత్యేక స్మారకం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నేతలు లేఖ రాయడంపై ఆమె మండిపడ్డారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రత్యేక స్మారకం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. ఈ అంశంపై ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలపై ఆమె ఆగ్రహం ‍వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి ప్రణబ్‌ ముఖర్జీ చనిపోయినప్పుడు మీరేం చేశారని కాంగ్రెస్‌ను శర్మిష్ఠా ముఖర్జీ ప్రశ్నించారు.

తన తండ్రి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చనిపోతే నివాళులర్పించడానికి కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత తనకు చెప్పారని ఆమె అన్నారు. అయితే, తర్వాత అది నిజం కాదని ప్రణబ్ రాసుకున్న డైరీ ద్వారా తనకు తెలిసిందని శర్మిష్ఠ వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నేతల తీరుపై ఆమె మండిపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. 92 ఏళ్ల మన్మోహన్‌ అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మన్మోహన్‌ పార్థివదేహాన్ని శనివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. అక్కడ ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పిస్తారని, అనంతరం 9:30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఉదయం 11:45 గంటలకు స్థానిక నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్‌ పార్థివదేహాన్ని శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంచారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)