Breaking News

థరూర్‌ సీపీఎంలో చేరబోరు: కారత్‌

Published on Fri, 03/14/2025 - 05:44

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ సీపీఎం పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ తాత్కాలిక సమన్వయకర్త ప్రకాశ్‌ కారత్‌ తోసిపుచ్చారు. ఆయన పార్టీ వీడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదన్నారు. కేవలం కేరళలో స్టార్టప్‌లు సాధిస్తున్న గణనీయమైన ప్రగతి గురించి మాత్రమే మాట్లాడారని చెప్పుకొచ్చారు. శశిథరూర్‌ సాధారణ వ్యక్తి కాదని ప్రశంసించిన కారత్‌.. ఆయన నిక్కచ్చి అభిప్రాయాలు కొన్నిసార్లు కాంగ్రెస్‌కు అసౌకర్యాన్ని కలిగిస్తాయన్నారు.

 కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం సాధిస్తున్న పారిశ్రామికాభివృద్ధిని ప్రశంసిస్తూ థరూర్‌ గత నెలలో ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు. ఇది రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్‌ దానిపై ప్రశ్నల వర్షం కురిపించగా.. సీపీఎం వ్యాసాన్ని స్వాగతించింది. అయితే తాను ప్రభుత్వాన్ని ప్రశంసించలేదని, కేవలం స్టార్టప్‌ రంగంలో రాష్ట్ర ప్రగతిని ఎత్తి చూపానని థరూర్‌ స్పష్టం చేశారు. ఆ తరువాత మలయాళంలో ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేరళలో పార్టీ నాయకత్వ బాధ్యతలకు తాను అర్హుడినని ప్రకటించారు. సంసిద్ధతను సైతం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన కాంగ్రెస్‌లో ఒక వర్గాన్ని కలవరపరిచింది. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ థరూర్‌ మీడియాపై మండిపడ్డారు.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)