Breaking News

మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు భారీ షాక్‌

Published on Fri, 08/01/2025 - 13:57

బెంగళూరు: కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ(35)కు భారీ షాక్‌ తగిలింది. పని మనిషిపై లైంగిక దాడి కేసులో జేడీఎస్‌ మాజీ నేతను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. శనివారం శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది.

హాసన్‌లోని గన్నికాడ ఫామ్‌హౌజ్‌లో 2021 COVID లాక్‌డౌన్ సమయంలో ప్రజ్వల్‌ తనపై మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ ఘటనను ప్రజ్వల్‌ తన మొబైల్‌లో వీడియో తీసి విషయం బయటకు చెప్పనీయకుండా బెదిరించినట్లు ఆమె ఆరోపించింది.  అదే సమయంలో..

ప్రజ్వల్‌ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. అయితే..  ఈ ఆరోపణలను ప్రజ్వల్‌ పేరెంట్స్‌ ఖండించారు. ఈ కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగగా.. బెయిల్‌ కోసం ప్రజ్వల్‌ చేసిన విజ్ఞప్తులను కోర్టు తోసిపుచ్చుతూ వచ్చింది.  

ఇదీ చదవండి:  ఏ గదిలో ఏం జరిగింది?.. వీడియో కెమెరా ఎక్కడ??

ఫోరెన్సిక్‌ నివేదికలు లీకైన వీడియోలను ధృవీకరించాయి. కిందటి ఏడాది మే 31వ తేదీన జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ప్రజ్వల్‌ను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు.  గత 14 నెలలుగా జ్యుడీషియల్‌ కస్టడీలోనే ప్రజ్వల్‌ ఉన్నాడు. CID-SIT దర్యాప్తులో DNA, ఫోరెన్సిక్, 26 మంది సాక్షుల వాంగ్మూలాలు, 2,000 పేజీల చార్జ్‌షీట్ సమర్పించారు. ఈ కేసులో 26 మంది సాక్షులను కోర్టు విచారించి.. దోషిగా ప్రకటించింది.

ఎవరీ ప్రజ్వల్‌ రేవణ్ణ?
ప్రజ్వల్‌ రేవణ్ణ.. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ తనయుడు. 2015లో జేడీఎస్‌లో చేరి.. 2019 ఎన్నికల్లో హసన్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆ దఫా పార్లమెంట్‌లో.. మూడో అత్యంత పిన్నవయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. అయితే 2023లో అఫిడవిట్‌లో లోపాల కారణంగా(రూ.24 కోట్ల లెక్కను చూపించకపోవడం) కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. లైంగిక దాడి కేసు నేపథ్యంలో జేడీఎస్‌ ఆయన్ని సస్పెండ్‌ చేసింది.

జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు షాక్

ఇదీ చదవండి: ప్రజ్వల్‌కు చీర చిక్కు

అశ్లీల వీడియోల కలకలం
పని మనిషిపై అత్యాచారం ఘటన మాత్రమే కాదు.. ప్రజ్వల్‌పై అశ్లీల వీడియోల కేసులు నమోదు అయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ వీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. హసన్‌లోని ఫామ్‌హౌజ్‌ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్రకలకలం రేపింది. ఇందుకుగానూ ప్రజ్వల్‌పై మూడు కేసులు నమోదు కాగా.. వాటిని సీఐడీ ఆధ్వర్యంలో సిట్‌ విచారణ జరుపుతోంది. ఇందులో స్వయంగా ప్రజ్వల్‌ చాలావరకు వీడియోలను చిత్రీకరించినట్లు అభియోగాల్లో దర్యాప్తు అధికారులు పేర్కొనడం గమనార్హం.

ఇదీ చదవండి: అసహజ లైంగిక దాడి కేసులో పటుత్వ పరీక్షలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)