Breaking News

అయోధ్య వేదికగా భగ్గుమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

Published on Mon, 11/09/2026 - 10:50

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో అయోధ్య రామమందిరం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ డిసెంబర్‌ 12న రామమందిరాన్ని సందర్శించనున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వేడి మొదలైంది. ఈ పర్యటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘాటుగా స్పందించారు. రామభక్తులపై గతంలో కాల్పులు జరిపించిన వారు ఆలయానికి వచ్చే ముందు భక్తులకు, సాధువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో అఖిలేశ్‌ అయోధ్య పర్యటన చుట్టూ రాజకీయ వివాదం రాజుకుంది.

డిసెంబర్‌ 12న తన భార్య డింపుల్‌ యాదవ్‌, కుటుంబ సభ్యులతో కలిసి అఖిలేశ్‌ యాదవ్‌ అయోధ్యకు వెళ్లనున్నారు. తొలుత హనుమాన్‌గఢీ ఆలయంలో పూజలు చేసి, అనంతరం రామమందిరాన్ని దర్శించుకోనున్నారు. 2024లో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అఖిలేశ్‌ తొలిసారిగా ఆలయాన్ని సందర్శించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. 1990లో అయోధ్యలో కరసేవకులపై జరిగిన పోలీసు కాల్పులను ప్రస్తావిస్తూ.. గతంలో రామభక్తులను అవమానించిన వారు ఇప్పుడు అయోధ్యకు రావాలనుకుంటున్నారని విమర్శించారు. ఆలయానికి రావడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, అయితే ముందుగా క్షమాపణ చెప్పాలని అన్నారు.

యోగికి అఖిలేశ్‌ కౌంటర్‌.. 
సీఎం యోగి వ్యాఖ్యలకు అఖిలేశ్‌ యాదవ్‌ కూడా గట్టిగానే స్పందించారు. రామమందిరానికి సంబంధించిన విరాళాలు, కానుకల చోరీ ఆరోపణలపై ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో దోషులు ఎవరో తేల్చే బాధ్యత ఎవరిపై ఉందని నిలదీశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరుగుతున్నప్పటికీ అసలు నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయని ప్రశ్నించారు. అయోధ్యలో అభివృద్ధి పనుల పేరుతో భూములు కోల్పోయిన స్థానికులకు పరిహారం విషయంలోనూ అన్యాయం జరిగిందని ఆరోపించారు.

అఖిలేశ్‌కు కాంగ్రెస్‌ మద్దతు!
మరోవైపు అఖిలేశ్‌ పర్యటనను కాంగ్రెస్‌ సమర్థించింది. ఆలయాన్ని సందర్శించడం వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయమని, దానిని రాజకీయ వివాదంగా మార్చడం సరికాదని పేర్కొంది. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన మతాన్ని ఆచరించే, ప్రార్థనా స్థలాలను సందర్శించే హక్కు కల్పించిందని కాంగ్రెస్‌ నేతలు గుర్తుచేశారు. ఇక బీజేపీ నేతలు మాత్రం అఖిలేశ్‌ పర్యటనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే రామమందిరం గుర్తుకొచ్చిందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల వేళ అయోధ్య కేంద్రంగా రాజకీయ పోరు!
2027లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రామమందిరం అంశం చుట్టూ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అఖిలేశ్‌ పర్యటనను బీజేపీ రాజకీయ కోణంలో చూస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం దాన్ని మతపరమైన పర్యటనగా అభివర్ణిస్తోంది. మొత్తంగా.. డిసెంబర్‌ 12న అఖిలేశ్‌ యాదవ్‌ అయోధ్య పర్యటన ఇప్పుడు సాధారణ ఆలయ దర్శనంగా కాకుండా ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. అఖిలేశ్‌ రామమందిరంలో ఏం మాట్లాడతారు? యోగి విమర్శలకు అక్కడి నుంచే సమాధానం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. 

ఇదీ చదవండి: ‘టపాసుల పొగతో వ్యాధులు నయం’ బీజేపీ ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)