Breaking News

ముగిసిన ఏఐసీసీ మీటింగ్‌.. సెబీ, అదానీలే టార్గెట్‌

Published on Tue, 08/13/2024 - 14:23

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏఐసీసీ సమావేశంలో ముఖ్యంగా సెబీ, అదానీల అంశంపై ముఖ్యంగా చర్చ జరిగినట్టు సమాచారం.  

ఈ సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..‘రానున్న ఎన్నికల కోసం  సన్నద్ధత, పార్టీ  సంస్థాగత అంశాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై చర్చ జరిగింది. సెబీ, అదానీల మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు అవసరం ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్‌పర్సన్ రాజీనామాను కోరాలి. అదానీ వ్యవహారంపై జేపీసీని ఏర్పాటు చేయాలి. దేశంలో హద్దులేని నిరుద్యోగం, అనియంత్రిత ద్రవ్యోల్బణం, పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ద్రోహం చేస్తోంది.

ఇక​, దేశంలో రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోంది. కుల గణన అనేది ప్రజల డిమాండ్. రైతులకు ఎంఎస్‌పీ చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలి. రైళ్లు పట్టాలు తప్పడం, రైలు ప్రమాదాలు  ఆనవాయితీగా మారాయి.  మౌలిక వసతులు మెరుగుపరచాలి. పలు సమస్యలపై జాతీయ స్థాయిలో  ప్రచారానికి రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్తాం అని చెప్పుకొచ్చారు.

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)