Breaking News

50 దాటిన పోలీసులకు రిటైర్మెంట్‌.. యూపీ ప్రభుత్వ నిర్ణయం

Published on Sat, 10/28/2023 - 12:12

పోలీసుల రిటైర్మెంట్ విషయంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు దాటిన పోలీసుల నిర్బంధ పదవీ విరమణ కోసం స్క్రీనింగ్‌కు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. 50 ఏళ్లు నిండిన పోలీసుల ట్రాక్‌ రికార్డును పరిశీలించి, తప్పనిసరి పదవీ విరమణ చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోలీసుల జాబితాను నవంబర్ 30లోగా ఇవ్వాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

2023, మార్చి 31 నాటికి 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సిబ్బందికి తప్పనిసరిగా పదవీ విరమణ కోసం స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం తన ఆదేశాలలో పేర్కొంది. 50 ఏళ్లు పైబడిన పోలీసుల ట్రాక్ రికార్డును పరిశీలించిన తర్వాత, నిర్ణీత తేదీలోగా నిర్బంధ పదవీ విరమణ చేయాల్సిన పోలీసుల జాబితాను అధికారులు ప్రధాన కార్యాలయానికి పంపించనున్నారు. 

తమ సర్వీసులో అవినీతికి పాల్పడినట్లు లేదా చెడు ప్రవర్తన ఉన్నట్లు తేలితే అతనిని రిటైర్ చేయనున్నారు. పోలీసుల స్క్రీనింగ్‌లో వారి వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్టును పరిశీలించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరిచే లక్ష్యంతో యోగి ప్రభుత్వం పనిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం పోలీసుశాఖలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేని అధికారులు, ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో సమర్థవంతులైన వారికి బాధ్యతలు అప్పగించాలని సీఎం యోగి ఆదేశించారు.
ఇది కూడా చదవండి:  గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్‌నాథ్ అగర్వాల్ కన్నుమూత!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)