Breaking News

Jammu-Kashmir: ఈ ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ. 5 లక్షల రివార్డు

Published on Sat, 08/10/2024 - 12:52

ఇటీవలి కాలంలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు కలకలం సృష్టిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది సంయుక్త ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు.  

ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య పలుచోట్ల ఎదురుకాల్పులు జరిగాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని కథువా పోలీసులు నలుగురు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశారు. ఈ ఉగ్రవాదులు చివరిసారిగా ధోక్ ఆఫ్ మల్హర్, బానీ, సియోజ్‌ధర్‌లో కనిపించారు. వీరికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.  

జూన్ 9న రియాసీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత జమ్మూ డివిజన్‌లో తీవ్రవాద ఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. శివఖోడి నుంచి వైష్ణోదేవికి వెళ్తున్న బస్సును ఉగ్రవాదులు చుట్టుముట్టారు. అనంతరం డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. అనంతరం ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో  తొమ్మదిమంది మరణించగా, 41 మంది గాయపడ్డారు.

ఈ దాడి జరిగిన రెండు రోజుల తరువాత కథువాలో రెండు ఉగ్రవాద ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 11న జమ్మూ డివిజన్‌లోని కథువా, దోడా, భదర్వాలో  ఉగ్రదాడులు జరిగాయి. నాటి ఎన్‌కౌంటర్‌లో భారత సైనికులు ఇద్దరు ఉగ్రవాదులను  మట్టుబెట్టారు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)