Breaking News

పద్మ భూషన్‌ పతకం విక్రయానికి యత్నం.. ఐదుగురు అరెస్ట్‌!

Published on Thu, 02/29/2024 - 11:11

దేశంలోనే మూడవ అత్యున్నత పౌర గౌరవ పురస్కార పతకం పద్మభూషణ్ చోరీకి గురైన ఉదంతం  ఢిల్లీలో వెలుగు చూసింది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న వ్యక్తికి కూడా తెలియలేదు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకాన్ని అతని సహాయకుడు దొంగిలించాడు. ఈ పద్మభూషణ్ పతకాన్ని ఒక దుకాణంలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా ఈ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మెడల్‌పై పద్మభూషణ్ అని రాసి ఉన్నందున, ఈ పతకాన్ని కొనుగోలు చేసేందుకు స్వర్ణకారుడు దిలీప్ నిరాకరించాడు. దీంతో ఆ ముగ్గురూ మరో స్వర్ణకారుని సంప్రదించారు. 

ఆగ్నేయ జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ రాజేష్ దేవ్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ హరిసింగ్, రింకీ వేద్ ప్రకాష్ అనే ముగ్గురు ‍స్నేహితులు పద్మభూషణ్ పతకాన్ని విక్రయించేందుకు కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నగల దుకాణం నడుపుతున్న దిలీప్‌ను సంప్రదించారని తెలిపారు. అయితే దిలీప్‌ ఈ విషయాన్ని కల్కాజీ పోలీసులకు తెలియజేశాడు.  పోలీసు బృందం అక్కడకి చేరుకునేలోపే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తమై ఆ ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.  

నిందితులంతా మదన్‌పూర్‌ ఖాదర్‌కు చెందినవారని దిలీప్‌ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మదన్‌పూర్‌ ఖాదర్‌ నివాసి శ్రవణ్‌ కుమార్‌ (33), హరి సింగ్‌ (45), రింకీ దేవి (40), వేద్‌ ప్రకాష్‌ (39), ప్రశాంత్‌ బిస్వాస్‌ (49)గా గుర్తించారు. నిందితుడు శ్రవణ్ కుమార్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత జిసి ఛటర్జీ ఇంట్లో మెడికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 
 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)