Breaking News

జైలు నుంచి రాను..ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విధించండి

Published on Mon, 03/27/2023 - 08:11

గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు అతిక్‌ అహ్మద్‌ గుజరాత్‌ జైలులో ఉన్నాడు. అతన్ని విచారణ నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ కోర్టుకు తరలించాల్సి ఉంది. తన ప్రాణాలకు హాని అంటూ బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నాడు. గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న తనను ప్రయాగ్‌రాజ్‌కు తీసుకువెళ్తుండగా..ఎన్‌కౌంట్‌లో చంపేస్తారని భయపడుతున్నట్లు అధికారిక వర్గాలు తెలపాయి. అతిక్‌పై కిడ్నాప్, హత్య కేసులు ఉన్నాయి. ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం కోర్టుకి హాజరు కావల్సి ఉండగా..అతిక్‌ మాత్రం ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫర్సెన్స్‌ ద్వారా ఖరారు చేయండి అని వేడుకుంటున్నాడు.

వాస్తవానికి ఉమేష్‌ పాల్‌ హత్య కేసులో అతిక్‌ అహ్మద్‌కు మార్చి 28న కోర్టులో శిక్ష ఖరారు కానుంది. ఐతే ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న మరో వ్యక్తి ఈ నెల ప్రారంభంలోనే ఎన్‌కౌంటర్‌ కాల్పుల్లో చనిపోయాడు. దీంతో అతిక్‌లో భయాలు మొదలయ్యాయి. అతన్ని ఈ రోజు తెల్లవారుజామున కస్టడీలోకి తీసుకోవడానికి ఉత్తర పోలీసులు బృందం సబర్మతి జైలుకి చేరుకోగా..అతిక్‌ వచ్చేందుకు నిరాకరించాడు. అతడిని కస్టడీకి తీసుకోవడానికి జైలు అధికారులతో అధికారుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. అయితే దీనికి సుప్రీం కోర్టు క్లియరెన్స్‌ అవసరమని జైలు అధికారులు చెప్పినట్లు సమాచారం.

కాగా, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్‌ పాఠక్‌ అన్నారు. అయినా కోర్టు ఆదేశాల మేరకు తాము నడుచుకుంటున్నామని, కోర్టు ఏది చెబితే అదే చేస్తాం అని బ్రజేష్‌ అన్నారు. ఇదిలా ఉండగా, 2005లో బీఎస్పీ శాసనసభ్యుడు రాజుపాల్‌ హత్య కేసులో అతిక్‌ అహ్మద్‌ ప్రధాన నిందితుడు. హత్యలో ప్రధాన సాక్షి అయిన ఉమేష్‌ పాల్‌ను హత్య చేసినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొటున్నారు. ఐతే సాక్షి ఉమేష్‌పాల్‌ అపహరణకు గురై కిడ్నాప్‌ కేసు విచారణ రోజే పట్టపగలే హత్యకు గురయ్యాడు. ఈ ఉమేష్‌పాల్‌ని చంపిన వ్యక్తి విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

దీంతో అతిక్‌లో భయాలు మొదలయ్యాయి.  తనను కూడా విచారణ పేరిట ప్రయాగ్‌రాజ్‌కి తరలిస్తుండగా..ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారేమోనని భయపడుతున్నాడు అతిక్‌. అతను తరుఫున న్యాయవాది కూడా విచారణ మాదిరిగానే కోర్టు నిర్ణయాన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారే శిక్ష విధించాలని అలహాబాద్‌ హైకోర్టులో దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతిక్ అహ్మద్‌ 100కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.

(చదవండి: అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది: శశి థరూర్‌)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)