విద్యార్థుల ఉద్య‌మానికి మ‌ద్దతు.. పోలీసు ఉద్యోగాల‌కు గుడ్ బై

Published on Fri, 07/24/2026 - 20:15

న్యూఢిల్లీ: నీట్ అక్ర‌మాల‌కు బాధ్య‌త వ‌హించి కేంద్ర విద్యామంత్రి ధ‌ర్మంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌న్న డిమాండ్‌తో కాక్రోజ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) పోరాటం కొన‌సాగుతోంది. కేంద్ర ప్ర‌భుత్వంతో ఒక్క‌ప‌క్క చ‌ర్చ‌లు జ‌రుపుతూనే ఉద్య‌మాన్ని న‌డిపిస్తోంది. మ‌రోవైపు విద్యార్థుల పోరాటానికి దేశ‌వ్యాప్తంగా వివిధ వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు వ‌స్తోంది. యువ‌త‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ‌ను ముక్త‌కంఠంతో అంద‌రూ ఖండిస్తున్నారు. తాజాగా ఇద్ద‌రు పోలీసులు త‌మ ఉద్యోగాల‌కు రాజీనామా చేశారు. విద్యార్థుల ఉద్య‌మానికి సంఘీభావంగా తాము ఉద్యోగాలు వ‌దులుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఉత్తరాఖండ్‌కు చెందిన షేర్ సింగ్ అనే పోలీసు కానిస్టేబుల్ శుక్రవారం ఢిల్లీ జంతర్‌మంతర్‌లో తన ఉద్యోగానికి రాజీనామా ప్ర‌క‌టించారు. ధ‌ర్నా వేదిక‌పై సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దిప్కే స‌మ‌క్షంలో త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. 'పట్వారీ' ఉద్యోగ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కిరాణా దుకాణాల్లో దొరికిందని షేర్ సింగ్ ఆరోపించారు. 2021 నుంచి ఉత్తరాఖండ్‌లో పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు.

"ఇది భగత్ సింగ్ దేశం, విప్లవం బాంబులు లేదా పిస్టల్స్ ద్వారా రాదు... మనం ఈ దుర్మార్గులను ఎదుర్కొంటాం. విప్లవం ఆలోచనల నుంచి పుడుతుంది, ఆ ఆలోచనలు ఎప్పటికీ నశించవు" అని ఆయన అన్నారు. ఆ తర్వాత తన పోలీసు బ్యాడ్జ్‌ను తీసి అభిజిత్ దిప్కేకు అప్పగించారు. అయితే, ఆ కానిస్టేబుల్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశామని ఉత్తరాఖండ్ పోలీసులు తర్వాత తెలిపారు.

ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న‌ట్టు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల స‌మ‌క్షంలో రవి కుమార్ అనే వ్య‌క్తి ప్ర‌క‌టించాడు. సెలువులో ఉన్న త‌న‌ను విధుల్లో చేరాలని పై అధికారుల‌ నుంచి ఒత్తిడి రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపాడు. "నాకు ప్రభుత్వ నివాసం వద్దు, ప్రభుత్వ వాహనం వద్దు, ప్రభుత్వ జీతం కూడా వద్దు" అని ప్ర‌క‌టించాడు.

మాకు సంబంధం లేదు
ఢిల్లీ పోలీసులతో రవి కుమార్‌కు ఎటువంటి సంబంధం లేదని డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రత్యేక విభాగమైన 'ఢిల్లీ హోమ్ గార్డ్స్'లో అత‌డు వలంటీర్ మాత్రమేన‌ని వెల్ల‌డించింది. దుష్ప్రవర్తన కారణంగా అతడిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపింది. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కుమార్ చేసిన వ్యాఖ్యలు అతడి వ్యక్తిగత అభిప్రాయాలని, అవి ఢిల్లీ హోమ్ గార్డ్స్, ఢిల్లీ పోలీసులు లేదా ఏ ప్రభుత్వ సంస్థ అభిప్రాయాలు కాద‌ని పేర్కొంది. 

చ‌ద‌వండి: విద్యార్థుల ఉద్య‌మం.. త‌ర‌లివ‌చ్చిన సినీ తార‌లు

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)