Breaking News

రోజుకు రూ. 5 వేలు ఇస్తేనే వస్తా..!

Published on Thu, 03/20/2025 - 07:20

యశవంతపుర: భార్య వేధిస్తోందని ఆత్మహత్య చేసుకున్న భర్తల గురించి బెంగళూరులో వార్తలు వస్తుంటాయి. అదే రీతిలో భార్య సతాయిస్తోందని గోడు వెళ్లబోసుకున్నాడు ఓ భర్త. దగ్గరకు పిలిస్తే, రోజుకు రూ. 5 వేలు ఇస్తేనే వస్తానంటోందని వాపోయాడు. ఆమె వేధింపులను తట్టుకోలేక టెక్కీ భర్త పోలీసులను ఆశ్రయించాడు. 

వివరాలు.. టెక్కీ శ్రీకాంత్‌కు 2022లో సదరు యువతితో వివాహమైంది. పెళ్లి రోజు నుంచి ఒక్కరోజు కూడా సంసారం చేయలేదు. పిల్లలు కావాలని శ్రీకాంత్‌ భార్యను అడగ్గా, 60 ఏళ్లు వయస్సు వచ్చినప్పుడు ఆ సంగతి చూద్దాం, ఇప్పుడైతే ఎవరినైనా దత్తతకు తీసుకొందామని ఉచిత సలహాలిచ్చేది. భార్య కదా అని ఆమెను ముట్టుకోబోతే భగ్గుమనేది. డెత్‌నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించేది.  

పాటలు పెట్టి డ్యాన్సులు  
భర్త వర్క్‌ ఫ్రం హోంలో డ్యూటీ చేసుకుంటుంటే చాలు, ఆమె గట్టిగా పాటలు పెట్టి డ్యాన్స్‌ చేసేది. ఒక వేళ విడాకులు తీసుకోవాలని అనుకుంటే తనకు రూ.45 లక్షలు పరిహారం ఇవ్వాలని, ప్రతినెలా భరణం కింద పెద్దమొత్తం ముట్టజెప్పాలని తేల్చిచెప్పింది.  ఇంత డబ్బును తానెక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని బాధితుడు వాపోయాడు. ఇదే కాకుండా వీరిద్దరూ మాట్లాడిన ఆడియో సామాజిక మాద్యమాలలో వైరల్‌గా మారింది. భార్యకు ఆమె తల్లిదండ్రులు వంత పాడుతున్నారని తెలిపాడు. ఈ మేరకు వయ్యలికావల్‌ ఠాణాలో అతడు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)