Breaking News

భూ కుంభకోణం.. సీఎం సిద్ద‌రామ‌య్య భార్య‌పై కేసు

Published on Wed, 07/10/2024 - 10:12

బెంగ‌ళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్, మరొకరిపై పోలీసులకు కేసు నమోదైంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో పోలీసులు ముగ్గురిపై కేసు న‌మోదు చేశారు.  

భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్య, ఆయన స‌తీమ‌ణి పార్వ‌తి, ముడా అధికారులతోపాటు మైసూరు జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రమేయం ఉంద‌ని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఈ ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కృష్ణ కర్ణాటక గవర్నర్, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ కూడా రాశారు.

స్నేహమయి కృష్ణ ఫిర్యాదు మేరకు.. సిద్ధరామయ్య బావమరిది మల్లికార్జున్ ఇతర ప్రభుత్వ, దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో 2004లో అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నార‌ని ఆరోపించారు. సీఎం స‌తీమ‌ణి పార్వతి, మల్లికార్జున్‌, మరో వ్యక్తి ఈ పత్రాలను ఉపయోగించి ముడాకు చెందిన కోట్లాది రూపాయలను మోసం చేశారని ఆరోపించారు.

త‌న ఫిర్యాదుపై పోలీసులు అంగీకారపత్రం అందించారని, కానీ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినందున ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆమె చెప్పారు.త‌న ఫిర్యాదు మేరకు ఏడు రోజుల్లోగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త పోలీసులను కోరారు.

కాగా 2021లో రాష్ట్రంలో బీజేపీ హయాంలో సిద్ద‌రామ‌య్య‌ భార్య ముడా ఆర్డర్‌కు లబ్ధిదారుగా ఉన్నందున భూ కేటాయింపుల కుంభకోణం వార్త‌ల్లో నిలిచింది. ఆ సమయంలో ఆమెకు సంబంధించిన‌ 3.16 ఎకరాల భూమిని అక్రమంగా సేకరించినందుకు పరిహారంగా... మైసూరులోని ప్రధాన ప్రదేశాలలో 38,284 చదరపు అడుగుల భూమిని త‌న‌కు కేటాయిచారు.  

మైసూరులోని కేసరే గ్రామంలోని 3.16 ఎకరాల భూమిని సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకోగా.. పార్వ‌తికి  2021లో బీజేపీ దక్షిణ మైసూర్‌లోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్ 3, 4వ దశ లేఅవుట్‌లలోని సైట్‌ల‌ను ఆమెకు పరిహారం చెల్లించింది, ఇది కేసరే గ్రామంలోని అసలు భూమి కంటే చాలా ఎక్కువగా ఉందని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

అయితే, ఈ కేటాయింపును గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని పేర్కొంటూ సిద్ధరామయ్య సమర్థించారు. కేసరెలోని దేవనూరు 3వ స్టేజీ లేఅవుట్‌లో స్థలాలు అందుబాటులో లేకపోవడంతో విజయనగరంలో ఉన్న స్థలాలకు పరిహారం చెల్లించాలని ముడా నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)