Breaking News

పూజా ఖేద్కర్‌ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌.. ఆమె తండ్రిపై కేసు ఫైల్‌

Published on Fri, 08/09/2024 - 17:31

ముంబై: దేశంలోనే వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌ ఎపిసోడ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా పూజా తండ్రి దిలీప్ ఖేద్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పూణే కలెక్టరేట్‌లో ఓ ఉద్యోగి ఫిర్యాదు మేరకు దిలీప్‌ ఖేద్కర్‌పై నమోదైంది.

వివరాల ప్రకారం.. ట్రైనీ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పూజా ఖేద్కర్‌కు కలెక్టర్‌గా పోస్టింగ్‌ వచ్చిన సమయంలో ఆమె తండ్రి దిలీప్‌ ఖేద్కర్‌ హంగామా క్రియేట్‌ చేశారు. పూణేలోకి కలెక్టర్‌ ఆఫీసుకు వెళ్లిన ఆయన.. అక్కడి పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. ఆఫీసులో ఉన్న సిబ్బందిని బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా తన కూతరు పూజా ఖేద్కర్‌కు క్యాబిన్‌ కేటాయించాలని డిమాండ్‌ చేసినట్టు కలెక్టరేట్‌కు చెందిన తహసీల్దార్‌ దీపక్‌ అకాడే తెలిపారు. ఇక, ఈ విషయమై అకాడే పోలీసులకు దిలీప్‌ ఖేద్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

మరోవైపు.. ఇప్పటికే పూజా ఖేద్కర్‌ పేరెంట్స్‌ పలు వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఓ భూవివాదం వ్యవహారంలో పూజ తల్లి మనోరమ కొందరిని గన్‌తో బెదిరించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆమెపైనా పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. తాజాగా ఆమె తండ్రిపై కేసు నమోదైంది.

ఇదిలా ఉండగా.. పూణే ఖేద్కర్‌ ఎపిసోడ్‌లో తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్‌, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్‌, వీఐపీ నంబర్‌ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో మొదలైన వివాదం పలు మలుపులు తిరిగింది. చివరకు ఆమె తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందినట్టు తేలడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజా ఖేద్కర్‌ ఎంపికను రద్దు చేసిన విషయం విధితమే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)